Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 Eliminator: బుమ్రా వల్ల కాదు.. ఆ కట్టప్ప వల్లే గుజరాత్‌ టైటాన్స్‌కు ఓటమి!

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో అందరి కన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఆ జట్టు ఎలిమినేటర్‌కే పరిమితమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా(1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి గుజరాత్ టైటాన్స్‌ ఓటమిని శాసించాడు.

Gerald Coetzee s Dropped Catch and Costly Final Over Haunt GT in Eliminator Loss to MI

ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు లేకపోవడం.. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఈ 24 పరుగుల్లో 22 రన్స్‌ను హార్దిక్ పాండ్యా తమ ఆఖరి ఓవర్‌లో సాధించడం గమనార్హం. ముంబై ఇండియన్స్ సందర్భంగా గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు భారీ సిక్స్‌లతో ఈ పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌ను కోయిట్జీ కట్టుదిట్టంగా వేసి 12 పరుగులకే పరిమితం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

బుమ్రా వల్ల ముంబై ఇండియన్స్ గెలిచినా.. గెరాల్డ్ కోయిట్జీ చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైంది. పేలవ బౌలింగే కాకుండా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కూడా కోయిట్జీ వదిలేసాడు. ఈ అవకాశం అందుకున్న రోహిత్ శర్మ ఏకంగా 81 పరుగులు చేశాడు. కోయిట్జీ ఈ క్యాచ్ పట్టినా.. ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా గుజరాత్ టైటాన్స్ సునాయసంగా విజయం సాధించేది. కోయిట్జీ పేలవ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌కు కట్టప్పలా మారి వెన్నుపోటు పొడిచాడు.

Story first published: Saturday, May 31, 2025, 7:01 [IST]
Other articles published on May 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+