
స్మిత్‌కు ఇష్టం లేదు:
రెండో టెస్టుకు జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి బెన్ ఫోక్స్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించడంపై మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ విమర్శలు గుప్పించారు. 'బట్లర్ విశ్రాంతి కోసం భారత్ నుంచి ఇంగ్లండ్‌కు వస్తున్నాడు. అయితే అతడి స్థానాన్ని బెయిర్‌స్టోతో కాకుండా ఫోక్స్‌తో పూరించడం బాధగా ఉంది. బ్యాట్స్‌మన్, కీపర్‌గా బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌కు ఇష్టం లేదు. అందుకే అతడు ఫోక్స్‌కు అవకాశం ఇచ్చాడు' అని టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల్లో జానీ బెయిర్‌స్టో బాగా ఆడాడు. తొలి టెస్టులో 47, 35 (నాటౌట్).. రెండో టెస్టులో 28, 29 పరుగులు చేశాడు.

బలవంతంగా ఇంగ్లండ్‌కు పంపించారు:
'జానీ బెయిర్‌స్టోకు ఎప్పుడూ తన తండ్రిలాగే కీపర్-బ్యాట్స్‌మన్‌గా రాణించాలని ఉందని చెపుతుండేవాడు. కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఉండటానికి ఇష్టపడడు. కానీ ఛీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అది సరైంది కాదు. అతడి విషయంలో జట్టు ప్రవర్తించిన తీరుతో యాజమాన్యం సిగ్గుపడాలి. లంక పర్యటన తర్వాత బెయిర్‌స్టోను బలవంతంగా ఇంగ్లండ్‌కు పంపించారు. అతడికి ఇష్టం లేకున్నా అలా చేశారు. కోహ్లీసేనతో ఆడాలని బెయిర్‌స్టోకు ఉంది. వాళ్లకు అవసరమైనప్పుడు వచ్చి ఆడాలా?, గంగిరెద్దులా తల ఊపాలా?' అని బాయ్‌కాట్ ఫైర్ అయ్యారు.

యాజమాన్యం సిగ్గుపడాలి:
'శ్రీలంకలో జానీ బెయిర్‌స్టో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండేళ్ల తర్వాత అతను భారతదేశ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు జానీకి అక్కడ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడు. అయినా పక్కన పెట్టారు. బెయిర్‌స్టో విషయంలో జట్టు ప్రవర్తించిన తీరుతో యాజమాన్యం సిగ్గుపడాలి' అని బాయ్‌కాట్ పేర్కొన్నారు. రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేయాలని, అయితే ఏదో ఒక పరిస్థితిలో అది బలహీనంగా మారుతుందన్నారు.

బెయిర్‌స్టోకు మంచి రికార్డు:
భారతదేశంలో బెయిర్‌స్టోకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆరు టెస్టుల్లో 40.11 సగటుతో 361 పరుగులు చేశాడు. ఉపఖండంలో అతని టెస్టు సగటు 40గా ఉంది. అంతేకాదు ఓ సెంచరీ కూడా చేశాడు. 72 టెస్టుల్లో 35.03 సగటుతో ఆరు సెంచరీలు మరియు 21 అర్ధ సెంచరీలతో 4169 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్న జానీకి.. భారత్ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం అతడిది.
నాలుగు మార్పులతో ఇంగ్లండ్.. అండర్సన్, ఆర్చర్, బట్లర్ ఔట్! తుది జట్టు ఇదే!!


Click it and Unblock the Notifications












