For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్​కే ప్రాధాన్యమిచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించండి!

Geoffrey Boycott says England Should Dock Money If Cricketers Put IPL Over National Duty

లండన్: దేశాన్ని కాదని డబ్బుల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రాధాన్యమిచ్చే ఇంగ్లండ్​ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని.. ఇంగ్లండ్​ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్ సూచించాడు​. ఇంగ్లండే కాకుండా ఇలాగే ఈ క్యాష్ రిచ్ లీగ్​లో ఆడే అన్ని దేశాల క్రికెటర్ల నుంచి ఆయా క్రికెట్ బోర్డులు 10 శాతం కోత విధించాలన్నాడు.

'ఇంగ్లండ్​ తరఫున జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లకు మంచి జీతం లభిస్తుంది. దేశానికి ఆడటానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించడానికి నేను అడ్డుపడను. కానీ, జాతీయ జట్టుకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.'అని జెఫ్రీ బాయ్​కాట్ పేర్కొన్నాడు.

అదో తెలివి తక్కువ పని..

అదో తెలివి తక్కువ పని..

ఇంగ్లండ్​ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్​ పాలసీపై జెఫ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదొక తెలితక్కువ, అర్దరహితమైన పనని విమర్శించాడు. 'ఆటగాళ్లకు ఏదైనా మానసిక సమస్యలుంటే, బయో బబుల్ వాతావరణాన్ని వారు ఎదుర్కోలేకపోతుంటే.. వాళ్లను స్వదేశానికి పంపొచ్చు. అంతేకాని.. రొటేషన్​ పాలసీ సరైన విధానం కాదు. దీన్ని తక్షణమే నిలిపివేయాలి. కారణం లేకుండా స్వదేశానికి వెళ్తానని ఏ ఒక్క క్రికెటర్​ కోరినా.. అతని జీతంలో కోత విధించండి. లేకపోతే ముందుగానే సిరీస్​ మొత్తానికి ఆడే విధంగా ఒప్పందం చేసుకోవాలి.'అని జెఫ్రీ బోర్డుకు సూచించాడు.

అందరూ ఆడుతారు..

అందరూ ఆడుతారు..

ఐపీఎల్​ ఆడే ఏ ఆటగాడైనా ఈ విధమైన కారణాలతో ఐపీఎల్​కు దూరమవుతున్నారా? అని బాయ్​కాట్​ ప్రశ్నించాడు. సీనియర్​ క్రికెటర్​ జెఫ్రీ.. ఐపీఎల్​పై ఈ తరహా వ్యాఖ్యలు చేయగా, ఇంగ్లండ్​ కోచ్​ సిల్వర్​వుడ్​ మాత్రం ఐపీఎల్​కు తమ ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారని ఇంతకుముందే వెల్లడించాడు. ఈ పొట్టి లీగ్​ వల్ల న్యూజిలాండ్​తో జూన్​లో జరిగే టెస్టు సిరీస్​కు పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేరు.

ఐపీఎల్​‌తో ఇంగ్లండ్‌కు మేలు..

ఐపీఎల్​‌తో ఇంగ్లండ్‌కు మేలు..

మరోవైపు ఐపీఎల్ .. ఇంగ్లండ్​​కు చాలా ఉపయోగపడింది ఇంగ్లండ్​ క్రికెటర్​ జోస్ బట్లర్ తెలిపాడు. ఐపీఎల్ ద్వారా​ తమ జట్టు చాలా లాభపడిందని అభిప్రాయపడ్డాడు. 'కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఐపీఎల్ మంచి వేదిక. భారత్​లో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్​ దృష్ట్యా.. ఐపీఎల్ చాలా అవసరం. ఈ లీగ్​ వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్​ జట్టుకు కూడా ఎంతో లబ్ధి చేకూరింది. ఆటలో పురోగతి సాధించడానికి, నైపుణ్యాలు నేర్చుకోవడానికి, అనుభవం సంపాదించడానికి ఈ టోర్నీ చాలా దోహదపడింది. ఇంగ్లండ్​ పరిమిత ఓవర్ల క్రికెట్​ అభివృద్ధికీ ఐపీఎల్​ ఉపయోగపడింది.'అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

ఎలా వదులుకుంటాం..

ఎలా వదులుకుంటాం..

పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్‌ను వదులుకోలేమని బట్లర్‌ స్పష్టం చేశాడు. దేశానికి ఆడటం గర్వకారణమేనని తెలిపాడు. కొన్నిసార్లు రెండింటి మధ్య సమతూకం కష్టమేనని అంగీకరించాడు. ఐపీఎల్‌ కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకోవచ్చన్న విమర్శల నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. 'మిగతా ఆటగాళ్ల సంగతి నాకు తెలియదు.

న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ప్రకటించక ముందే ఐపీఎల్‌ భాగస్వామ్యంపై ఒప్పందం కుదిరింది. నిజమే, తమ ఫ్రాంఛైజీలు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే ఆ సిరీస్‌ ఆడని పరిస్థితి రావొచ్చు. ఏదేమైనా కివీస్‌ సిరీస్‌ను షెడ్యూల్​లో తర్వాత చేర్చారు. కానీ ఇంగ్లండ్‌ మ్యాచ్​లను ప్రతిసారీ కొందరు ఆటగాళ్లు మిస్సవుతూనే ఉంటారు కదా.'అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, March 10, 2021, 16:22 [IST]
Other articles published on Mar 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+