న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీసీ కామెంట్రీకి జెఫ్రీ బాయ్‌కాట్ గుడ్‌బై

Geoffrey Boycott leaves BBCs Test Cricket commentary team

లండన్‌: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ జెఫ్రీ బాయ్‌కాట్‌.. బీబీసీ టెస్టు మ్యాచ్‌ కామెంటరీ టీమ్‌ నుంచి వైదొలిగాడు. కరోనా విజృంభిస్తున్న ఈ దశలో తన వయస్సురీత్యా కామెంట్రీ చేయడం సరికాదని 79 ఏళ్ల జెఫ్రీ తెలిపాడు. దీంతో బీబీసీతో జెఫ్రీ 14 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. వాస్తవానికి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య వచ్చే నెలలో జరిగే టెస్టు సిరీస్‌కు జెఫ్రీ కామెంట్రీ చెప్పాల్సి ఉంది. 'ఇటీవలే నాకు బైపాస్‌ సర్జరీ జరిగింది. అలాగే బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనడం నా వయస్సురీత్యా సరికాదు. 14 ఏళ్లపాటు బీబీసీలో పనిచేసిన సమయాన్ని ఆస్వాదించా' అని బాయ్‌కాట్‌ ట్వీట్‌ చేశాడు.

ఇంగ్లండ్ తరఫున 108 టెస్ట్‌లు, 36 వన్డేలు ఆడిన జెఫ్రీ బాయ్‌కాట్.. ఓవరాల్‌గా 9,196 పరుగులు చేశాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 22 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలతో 8114 పరుగులు చేసిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. వన్డేల్లో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలతో 1082 రన్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జూలై 8 నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

పోలీస్ కేసుపై స్పందించిన యువరాజ్ సింగ్!పోలీస్ కేసుపై స్పందించిన యువరాజ్ సింగ్!

Story first published: Sunday, June 7, 2020, 9:29 [IST]
Other articles published on Jun 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X