
ఇషాన్ కిషన్ సరైనోడు..
ఇక టీ20 ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్‌తో పాటు ఇతర యువ ఆటగాళ్లు రోహిత్‌కు జతగా అవకాశం ఇస్తున్నా.. వన్డేల్లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే అతను పేలవ ఫామ్‌తో సతమతమవడంతో అతన్ని పక్కనపెట్టాలని చర్చ ఊపందుకుంది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో ఈ డిమాండ్ ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై మాట్లాడిన గంభీర్.. తనవరకైతే అసలు ఈ చర్చే అవసరం లేదని, వన్డేల్లో కూడా ఇషాన్ కిషన్ రోహిత్ కు జోడీగా రావాలని అన్నాడు.

డబుల్ సెంచరీ చేసాక డౌట్ ఎందుకు?
స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షో లో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేశాడు. ప్రత్యర్థి సొంతగడ్డపై.. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డారు. కానీ ఇషాన్ మాత్రం మూడో వన్డేలో 35వ ఓవర్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంతకు మించి ఏం కావాలి..? వన్డేల్లో రోహిత్‌కు జతగా ఇషాన్ కిషనే ఆడాలి. ఇషాన్ ఓపెనర్ బ్యాటర్ గానే గాక వికెట్ కీపర్‌గా కూడా సేవలందించగలడు. ఇంకేం కావాలి..? అతను డబుల్ సెంచరీ చేసిన తర్వాత నా వరకైతే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ అనవసరం అనిపిస్తోంది.'అని గంభీర్ తెలిపాడు.

టాప్-6 బ్యాటర్లు వీళ్లే..
మరి వచ్చే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా తుది జట్టును గురించి కూడా గంభీర్ కామెంట్స్ చేశాడు.'రోహిత్ - ఇషాన్‌లు ఓపెనింగ్ చేయాలి. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడాలి. నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలి. గత ఏడాదిన్నర కాలంగా అయ్యర్ వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడు. అయ్యర్ తర్వాత ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా ఉండాలి.'అని చెప్పాడు.

సొంత కెప్టెన్‌నే విస్మరించిన గంభీర్..
గంభీర్ వెల్లడించిన టాప్ - 6 బ్యాటర్లలో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల పేర్లు లేకపోవడం గమనార్హం. కేకెఎల్.. ఇషాన్‌కు బ్యాకప్ కీపర్, బ్యాటర్ గా ఉండాలని గంభీర్ చెప్పాడు. గంభీర్.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెంటార్‌గా ఉండగా.. ఆ జట్టుకు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌కు గంభీర్ అండగా నిలవకపోవడం విశేషం.


Click it and Unblock the Notifications












