Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను విరాట్ కోహ్లీకి వ్యతిరేకం కాదు.. కానీ..! : గౌతమ్ గంభీర్

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఫ్రాంచైజీకి ఎక్కువకాలం ఆడిన ఏకైక ప్లేయర్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2011 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఏకైన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే.

2013లో ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలను తీసుకున్న విరాట్ కోహ్లీ.. 2021 వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. అతని సారథ్యంలో ఆర్‌సీబీ ఒకే ఒక్కసారి ఫైనల్ చేరింది. ఐపీఎల్ 2016 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. బ్యాటర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీకి టైటిల్ మాత్రం అందించలేదు.

Gautham Gambhir says I have nothing against Virat Kohli but

ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడిన గంభీర్.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించాలని సూచించాడు. ఐపీఎల్ 2013-2020 వరకు జట్టును నడిపించిన కోహ్లీ.. టీమ్ పరాజయాలకు బాధ్యత వహించి కెప్టెన్సీ వదిలేయాలన్నాడు.

'8 ఏళ్ల కోహ్లీ సారథ్యంలో ఆర్‌సీబీ టైటిల్ గెలవలేదు. మరే కెప్టెన్‌కు ఇంత సమయం దక్కింది? కెప్టెన్ వదిలేయ్.. కనీసం ఏ ఆటగాడికి ఇంత అవకాశం ఇచ్చారు? కాబట్టి ఈ వైఫల్యానికి విరాట్ కోహ్లీ బాధ్యత వహించాలి. ఈ ఒక్క ఏడాది గురించి చెప్పడం లేదు. ఈ 8 ఏళ్ల సుదీర్ఘ సమయం గురించి చెబుతున్నా. నేనేం విరాట్ కోహ్లీకి వ్యతిరేకం కాదు. కానీ అతనే ఆర్‌సీబీ పరాజయాలకు బాధ్యత వహిస్తున్నానని చెప్పి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.'అని గంభీర్ పేర్కొన్నాడు.

ఆ మరుసటి ఏడాదే విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ వదిలేసాడు. ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆడినా.. టైటిల్ అందుకోలేకపోయాడు. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన నేపథ్యంలో కోహ్లీ గురించి అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గంభీర్ కోచ్‌గా కోహ్లీ ఆటలో కొనసాగుతాడా? మధ్యలోనే వీడ్కోలు పలుకుతాడా? అనే చర్చ జరుగుతోంది.

Story first published: Sunday, July 14, 2024, 11:26 [IST]
Other articles published on Jul 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+