
మంచి మార్కెటింగ్ స్టంట్..
'కోహ్లీ సారథ్యంలో ఆడటం ఎంతో ఇష్టమని మ్యాక్స్‌వెల్ చెప్పడం మంచి మార్కెటింగ్ స్టంట్. అతను ఎక్కువగా పరుగులు చేయగల ఏకైక మైదానం చిన్నస్వామి స్టేడియమని భావిస్తున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పైనే ఒత్తిడి ఉంటుందని అతనికి తెలుసు. ఒకవేళ మ్యాక్స్‌వెల్ బెంగళూరు జట్టులోకి వచ్చినా కూడా అంచనాలన్నీ కోహ్లీ, డివిలియర్స్‌లపైనే ఉంటాయి. ఇది అనవసర ఒత్తిడి తగ్గిస్తుందని మ్యాక్సీ అభిప్రాయం. ఇక చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి మంచి అనువైన వేదిక. చిన్నస్వామిలో చేసిన పరుగులను చెన్నై చెపాక్‌లో సాధించినవాటితో పోల్చలేం. అందుకే నేను విరాట్ కోహ్లీ కన్నా సురేశ్ రైనాకే ఎక్కువ రేటింగ్ ఇస్తుంటాను.

ఆర్‌సీబీలోకి మ్యాక్సీ..
ఈ వేలంలో కూడా గ్లేన్ మ్యాక్స్ వెల్ కీలకం కానున్నాడు. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అతనిలాంటి ఆటగాళ్లు వేలంలో ఎక్కువగా లేకపోవడం కలిసొచ్చే అంశం. మ్యాచ్‌లు గెలిపించే సత్తా అతనిలో ఉంది. కానీ అతని నుంచి ఏం ఆశిస్తున్నారో అనే విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ క్లారిటీకి రావాల్సిన అవసరమైతే ఉంది. ఆ తర్వాత మ్యాక్సీని తీసుకునే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలి. ఇక మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ తీసుకునే అవకాశం ఉంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ సారథ్యంలో..
తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టమని, అతని సారథ్యంలో ఆడేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
'కోహ్లీ సారథ్యంలో ఆడటం, అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే విరాట్‌తో త్వరగా కలిసిపోతా. ఎప్పుడు కలిసినా విరాట్ ఏదో ఒక విషయంలో సాయపడుతుంటాడు. అతనో అత్యుత్తమ క్రికెటర్. కాబట్టి కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. ఏబీ డివిలియర్స్ నాకు స్పూర్తినిచ్చేవారిలో ఒకడు.
అతనితో కలిసి ఆడటం నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది.' అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.

రూ. 10.75 కోట్లు దండుగా..
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 టోర్నీలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. సిక్సర్ల కింగ్ అని పేరున్న మ్యాక్సీ.. టోర్నీ ఆసాంతం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. రూ.10.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్ తర్వాతి సీజన్‌కు అతడిని వదిలేసింది. మరో మూడు రోజుల్లో జరగనున్న 14వ సీజన్ వేలంలో ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ను తీసుకుంటుందా లేదా చూడాలి.


Click it and Unblock the Notifications












