For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: అందుకే జట్టులోకి వాషింగ్టన్ సుందర్.. గంభీర్ ప్లాన్‌తో న్యూజిలాండ్‌కు దబిడి దిబిడే!

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అనూహ్యంగా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో పాటు వర్షం అంతరాయం.. టీమిండియా ఓటమిని శాసించాయి.

ఈ ఓటమి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ సమీకరణాలను సంక్లిష్టం చేసింది. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది. రెండో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Gautam Gambhir s master plan behind surprising Washington Sundar inclusion ahead of IND vs NZ 2nd Test

రెండో టెస్ట్‌కు ర్యాంక్ టర్నర్
పుణె వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌‌కు ర్యాంక్ టర్నర్ పిచ్‌ను సిద్దం చేయిస్తోంది. అంతేకాకుండా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. స్వింగ్ బౌలింగ్‌తో దెబ్బతీసిన న్యూజిలాండ్‌కు గింగిరాలు తిరిగే బంతితో షాకివ్వాలనుకుంటోంది. ఈ క్రమంలోనే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది.

నాలుగేళ్ల క్రితం చివరి టెస్ట్ మ్యాచ్‌ ఆడిన సుందర్‌ను గౌతమ్ గంభీర్ పట్టబట్టి జట్టులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. ఇందులో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లు కాగా.. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్.

ఫింగర్ స్పిన్నర్ కావడంతో..
జడేజా, అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు.. లెఫ్టార్మ్ బ్యాటర్లు. కానీ సుందర్ మాత్రం లెఫ్టార్మ్ బ్యాటర్. కుడిచేతి బ్యాటర్ . అంతేకాకుండా ఫింగర్ స్పిన్నర్. మునివేళ్లతో బౌలింగ్ చేయడం అతని స్పెషలిటీ. దాంతో అతని కోసం గంభీర్ పట్టుబట్టాడు. ఇప్పటి వరకు సుందర్ నాలుగు టెస్ట్‌లు ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పేస్ పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి భారీ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ అతనికి కలిసొచ్చింది. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే వాషింగ్టన్ సుందర్‌‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాటింగ్ డెప్త్ కోసం..
అంతేకాకుండా బ్యాటింగ్ డెప్త్‌పై కూడా గంభీర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్స్‌తో పాటు బ్యాటింగ్‌లో 9వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు ఉంటే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు ఆస్కారం ఉంటుందనేది గంభీర్ ఆలోచన. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ గంభీర్ ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్‌తో తుది జట్టును ఎంపిక చేశాడు.

Story first published: Monday, October 21, 2024, 19:02 [IST]
Other articles published on Oct 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+