
24న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
ఈ ఏడాది అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. క్వాలిఫైర్ మ్యాచుతో మెగా టోర్నీ మొదలవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఢీ కొననున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

శార్దూల్ ఉంటే
స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్' చర్చలో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్ కోసం భారత జట్టును ఎంచుకున్నాడు. గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో అందరూ ఊహించిని వారినే ఎంచుకోగా.. స్పెసలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రం చోటివ్వలేదు. రవీంద్ర జడేజాకు తోడుగా వరుణ్ చక్రవర్తిని రెండవ స్పిన్నర్‌గా గౌతీ ఎంచుకున్నాడు.
భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ మరియు జస్ప్రీత్ బుమ్రాల రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకున్నాడు. అయితే భువనేశ్వర్ కుమార్ బదులుగా శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో చోటిస్తే బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. శార్దూల్ 15 మందిలో ఉంటే.. 8వ స్థానంలో అతడికే చోటిచ్చేవాడిని గంభీర్ అని చెప్పాడు.

అశ్విన్‌కు దక్కని చోటు
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉండాలి. విరాట్ కోహ్లీ వన్ డౌన్‌లో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ఐదవ స్థానంలో రిషబ్ పంత్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో రవీంద్ర జడేజాలు రావాలి.
భువనేశ్వర్ కుమార్ 8లో, వరుణ్ చక్రవర్తి 9లో, మొహ్మద్ షమీ 10.. ఇక పదకొండో ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా ఉండాలి' అని చెప్పుకొచ్చాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రం గౌతీ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో యాష్ జట్టులోకి వచ్చాడు.
మెరుగైన బ్యాటింగ్ చేయాలంటే.. రోహిత్ శర్మను అనుకరిస్తే సరిపోతుంది: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్

పాకిస్థాన్‌తో తలపడే గౌతమ్ గంభీర్ జట్టు ఇదే
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

బీసీసీఐ ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.


Click it and Unblock the Notifications












