Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెరుగైన బ్యాటింగ్ చేయాలంటే.. రోహిత్​ శర్మను అనుకరిస్తే సరిపోతుంది: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్

IND vs AUS: Alyssa Healy says I wants to replicate Rohit Sharmas success in all formats of the game
Alyssa Healy Wants To Replicate Rohit Sharma's All-Format Success || Oneindia Telugu

సిడ్నీ: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్​మ్యాన్ ​రోహిత్​ శర్మపై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిస్సా హేలీ ప్రశంసల వర్షం కురిపించింది. రోహిత్ బ్యాటింగ్ బాగుంటుందని పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో మెరుగైన బ్యాటింగ్ చేయాలంటే.. హిట్​మ్యాన్​ ఆటతీరును అనుకరిస్తే సరిపోతుందని చెప్పింది. తాను ఈ పద్ధతినే అవలంబించనున్నట్లు అలిస్సా హేలీ పేర్కొంది. భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక డే/నైట్‌ టెస్టు కోసం అక్కడికి వెళ్లారు. క్వీన్స్‌లాండ్‌లోనే అన్ని మ్యాచులు జరగనున్నాయి.

త్వరలోనే భారత్​, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మ్యాచ్​లు జరగనున్న నేపథ్యంలో అలిస్సా హేలీ మాట్లాడుతూ రోహిత్ శర్మపై తన అభిప్రాయం చెప్పింది. 'టెస్ట్​లో మెరుగ్గా ఆడుతానని చెప్పలేను. ఎందుకంటే.. ఇప్పటివరకు నేను నాలుగు టెస్టులు మాత్రమే ఆడాను. అయినా పెద్దగా మార్పు లేకుండా వన్డే తరహాలోనే ఆడాను. మోడ్రన్​ టెస్ట్​ క్రికెట్​లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాను. పురుషుల క్రికెట్​ ఎక్కువగా చూస్తాను. ముఖ్యంగా రోహిత్​ శర్మ్ బ్యాటింగ్​ తీరును బాగా గమనిస్తాను. అతను ప్రపంచంలో ఉన్న విధ్వంసకర బ్యాట్స్​మెన్​లలో ఒకడు. టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైన ఓపెనర్. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడిని అనుసరిస్తే.. అన్ని ఫార్మాట్లలో బాగా రాణించగలం' అని అలిస్సా పేర్కొంది.

భారత్​తో మ్యాచులు ఆడటం చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆస్ట్రేలియా మహిళా ఓపెనర్ అలిస్సా హేలీ తెలిపింది. ఈ టూర్​ కోసం భారత్​ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిందని, వారిలో కొందరిని గతంలో ఎపుడూ చూడలేదని పేర్కొంది. భారత్ ఇప్పుడు ప్రమాదకరంగా కనిపిస్తోందని, మూడు ఫార్మాట్లలో రాణిస్తోందని అలిస్సా హేలీ చెప్పుకొచ్చింది. వైట్-బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ రన్-స్కోరర్లలో ఒకడైన రోహిత్ శర్మ విదేశీ గడ్డపై నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ పర్యటనలో భారత్ సిరీస్ గెలవడంతో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అలిస్సా హేలీ తెలిపింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఫలితంగా భారత అమ్మాయిలు కఠిన క్వారంటైన్‌ కష్టాలు పడ్డారు. చాలీచాలని ఇరుకు గదుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం తమ పడక నుంచి పక్కకు నడిచేంత చోటూ వారికి లేకపోయింది. 14 రోజులు వారు ఇరుకు హోటల్‌ గదుల్లోనే ఉండాల్సి వచ్చింది. కొవిడ్‌ నిబంధనల వల్ల వేదికలు మారాయి. సిడ్నీ, పెర్త్‌, మెల్‌బోర్న్‌లో నిబంధనలు కఠినతరం చేశారు. ఫలితంగా అమ్మాయిలు క్వీన్స్‌లాండ్‌లోనే అన్ని మ్యాచులు ఆడనున్నారు. మొదటి వన్డే ​ సెప్టెంబర్ 21న ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, September 15, 2021, 11:47 [IST]
Other articles published on Sep 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+