Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ జీతం ఎంతంటే..?

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా అద్వితీయమైన ప్రదర్శన కనబర్చడంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు.ఈ సిరీస్ సందర్భంగా గంభీర్‌ నిర్ణయాలను తప్పుబట్టిన నెటిజన్లే తాజా విజయంతో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక దశలో టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. కానీ రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకున్నా జట్టును గంభీర్ నడిపించిన తీరు.. సాధించిన విజయాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంత జీతం తీసుకుంటాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ హెడ్ కోచ్‌ గంభీర్‌కు భారీ మొత్తంలోనే జీతాలు చెల్లిస్తుంది. అంతేకాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా గంభీర్ బాగానే సంపాదిస్తున్నాడు.

Gautam Gambhir s BCCI Head Coach Salary and Net Worth Details Revealed


హెడ్ కోచ్‌గా గంభీర్ జీతం రూ. 14 కోట్లు

పలు బిజినెస్ సైట్స్ రిపోర్ట్స్ ప్రకారం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఏడాదికి సుమారు రూ. 14 కోట్లు జీతంగా తీసుకుంటున్నాడు. అలవెన్సులు అదనం. విదేశీ పర్యటనల్లో డైలీ అలవెన్సుల కింద రూ. 21 000 లభిస్తుంది. ఐపీఎల్‌లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ రూ. 25 కోట్లు తీసుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా జీతం తక్కువ ఉన్నా.. దేశంపై ప్రేమతో గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టాడు.

రూ. 265 కోట్ల ఆస్థి..

ఓ జాతీయ చానెల్ వివరాల ప్రకారం గంభీర్ నెట్‌వర్త్ సుమారు రూ. 265 కోట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ ద్వారా ఏడాదికి రూ. 14 కోట్లు అందుకుంటున్న గంభీర్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ద్వారా కోట్లలో ఆర్జిస్తున్నాడు. రెడ్‌క్లిఫ్ ల్యాబ్స్, క్రిక్‌ప్లే, ఎమ్‌ఆర్‌ఎఫ్, రీబాక్ వంటి పాపులర్ బ్రాండ్స్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా వివిధ వ్యాపారాల్లో గంభీర్ పెట్టుబడులు పెట్టాడు. కొన్ని రెస్టారెంట్లలో భాగస్వామిగా ఉన్నాడు. 2019-2024 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జీతం లభించేది. ప్రస్తుతం ఆయనకు మాజీ ఎంపీగా పెన్షన్ వస్తుంది. అయితే ఇది అతను తీసుకుంటున్నారా? వద్దని చెప్పారా? అనే విషయం తెలియదు. తన నియోజకవర్గంలో గంభీర్ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.

కోట్లు విలువ చేసే ఇళ్లు..

రియల్ ఎస్టేట్‌లో కూడా గంభీర్‌కు భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో రూ. 20 కోట్లు విలువ చేసే ఒక లగ్జరీ బంగ్లా ఉంది. మల్కపూర్ గ్రామంలో రూ.కోటి విలువైన ప్లాట్, నోయిడాలోని జేపీ విష్ టౌన్‌లో రూ.4 కోట్లు విలువ చేసే మరొక ప్లాట్ కూడా గంభీర్‌కు ఉంది. గంభీర్‌కు పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బీఎమ్‌డబ్ల్యూ 530డీ, ఆడీ క్యూ5, మహీంద్రా బొలేరో స్టింగర్, మారుతి సుజుకి, టయోట కరోలా వంటి కార్లు కూడా ఉన్నాయి.

Story first published: Thursday, August 7, 2025, 11:13 [IST]
Other articles published on Aug 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+