యూనివర్స్ బాస్‌తో అతనికి పోలికా? గేల్‌ను ఓపెనర్‌గా పంపించాలి: గౌతమ్ గంభీర్

చెన్నై: ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ మళ్లీ విజయాల బాటపట్టాలంటే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ చేతిలో వరుసగా ఓటమిపాలైంది.దాంతో జట్టు కాంబినేషన్‌పై మాజీ క్రికటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. క్రిస్ గేల్‌కు బదులు టీ20 నంబర్ వన్ ప్లేయర్, ఇంగ్లండ్ హిట్టర్ డేవిమ్ మలాన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సలహాను గంభీర్ కొట్టిపారేశాడు.

ఓపెనర్‌గా వస్తే సెంచరీ కొట్టేవాడు..
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ ఫోతో మాట్లాడుతూ.. యూనివర్స్ బాస్, డేవిడ్ మలన్‌కు అస్సలు పోలికే అనవసరమని అభిప్రాయపడ్డాడు. 'డేవిడ్ మలాన్ ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో అతనికి పోలికే అనవసరం. మొదట గేల్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే ఆలోచనను పంజాబ్ విరమించుకోవాలి. గేల్ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌లన్నీ ఓపెనర్‌గా ఆడినవేనన్న విషయాన్ని మరవద్దు. ప్రస్తుత సీజన్‌లో గేల్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా 60కిపైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు. అదే ఓపెనర్‌గా ఇన్ని బంతల్ని ఆడి ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

పూరన్‌ను పక్కనపెట్టాలి..
జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ బలహీనమైన మిడిలార్డర్ కారణంగా పంజాబ్ మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకుంటుందని ఈ బీజేపీ ఎంపీ విశ్లేషించాడు.'మిడిలార్డర్ వైఫల్యంతో పంజాబ్ ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా యూనివర్సల్ బాస్‌ను ఓపెనర్‌గా పంపాలి. వరుసగా విఫలమవుతున్న నికోలస్ పూరన్ స్థానంలో మలాన్‌కు అవకాశం కల్పించాలి. ఓపెనర్లుగా రాహుల్, గేల్‌లు వస్తే పంజాబ్‌కు బలమైన పునాది లభిస్తుంది. దాంతో పంజాబ్ మళ్లీ విజయాల బాట పట్టవచ్చు.'అని తెలిపాడు.

మూడు మ్యాచ్‌ల్లో విఫలం..
ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో(రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 40) కాస్త పర్వాలేదనిపించిన గేల్.. ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో(10, 11, 15 పరుగులు) దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేసి టీ20 నంబర్ ఆటగాడు డేవిడ్ మలాన్‌కు(ఇంగ్లండ్) అవకాశం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. మరి పంజాబ్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో చూడాలి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఒక్క గెలుపు మాత్రమే గెలిచిన పంజాబ్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముంబైతో మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు చాలా అవసరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications