న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైజాగ్ వన్డేలో కుల్దీప్ గూగ్లీ బౌల్డ్ ఇదే(వీడియో)

Kuldeep Yadav castles Marlon Samuels with an excellent googly in IND vs WI Vizag ODI

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ విసిరిన ఓ గూగ్లీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ వేసిన కుల్దీప్ యాదవ్.. ఆ ఓవర్ ఐదో బంతిని గూగ్లీ రూపంలో విసిరాడు. దాన్ని అర్థం చేసుకోవడంలో మార్లోన్ శామ్యూల్స్‌ (13: 10 బంతుల్లో 3ఫోర్ల) పూర్తిగా విఫలమైయ్యాడు. బంతి అతని బ్యాట్ పక్క నుంచి వెంట్రుక వాసి దూరంలో వెళ్లి బెయిల్స్‌ను పడగొట్టింది.

1
44267

ఔట్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు

ఫలితంగా క్లీన్ బౌల్డ్‌కు గురైయ్యాడు. ఈ ఔట్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌కి నివేదించారు. రిప్లైలో శామ్యూల్స్ ఔటని తేలియడంతో వెస్టిండీస్ నాల్గో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది.

10 ఓవర్లు బౌలింగ్ చేసి 67 పరుగులిచ్చి

10 ఓవర్లు బౌలింగ్ చేసి 67 పరుగులిచ్చి

మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయంగా సెంచరీకి మించిన స్కోరు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 67 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

 321పరుగులతో టైగా ముగించి

321పరుగులతో టైగా ముగించి

అయితే మ్యాచ్ చివరి వరకూ గెలుపు ప్రశ్నగానే మారి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇన్నింగ్స్ ఆఖర్లో 7వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. క్రీజులో సహచరుడితో పాటుగా క్రీజులో షై హోప్ ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని ముందుగానే యార్కర్‌గా ఊహించాడట హోప్. దానిని ఫోర్ బౌండరీకి పంపడంతో విండీస్ స్కోరు 321పరుగులతో టైగా ముగించింది.

కోహ్లీ మాత్రం రికార్డులు బద్దలుకొడుతూ:

కోహ్లీ మాత్రం రికార్డులు బద్దలుకొడుతూ:

మ్యాచ్ సందర్భంగా ఎన్నో రికార్డులు బద్దలు కొడతారని ఊహించిన భారత బ్యాట్స్‌మెన్ విఫలమైయ్యారు. కాగా, కేవలం కోహ్లీ మాత్రం సొంత గడ్డపై 4 వేల పరుగుల పైగా స్కోరు సాధించిన రికార్డు సాధించాడు. ఇన్నింగ్స్‌కు ముందు పది వేల పరుగుల క్లబ్‌కు దూరంగా ఉన్న 81పరుగులు దాటేసి మరో రికార్డు సృష్టించాడు.

Story first published: Thursday, October 25, 2018, 15:19 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X