Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir:అతనిలా రోహిత్ సెంచరీల కోసం ఆడటం లేదు!

World Cup 2023: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశంసిస్తూ కోహ్లీని తక్కువ చేసేలా మాట్లాడాడు. అభిమానులు, అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విరాట్ కోహ్లీకి అనవసర హైప్ ఇస్తున్నారని మండిపడ్డాడు.

విరాట్ కోహ్లీలా రోహిత్ శర్మ సెంచరీల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్నాడని కామెంట్ చేశాడు. వన్డేల్లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్‌ 49 సెంచరీల రికార్డు సమం చేసేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. విరాట్ కోహ్లీ సెంచరీలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది.

Gautam Gambhir slams Star Sports for hyping up Virat Kohli during IND vs ENG World Cup 2023 Match

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ వీడియోపై మాట్లాడిన గంభీర్.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ సెంచరీల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్నాడని, అతని అప్రోచ్ బాగుందని చెప్పాడు. 'అభిమానులు, ప్రసారకర్తలు, గణంకాలను పట్టించుకోకుండా రోహిత్ శర్మ జట్టు కోసం పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాడు.

తన ఆటతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓ నాయకుడిలా స్వార్థం లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెంచరీలే చేయాలనుకుంటే రోహిత్ శర్మ ఇప్పటికే 40-45 శతకాలు నమోదు చేసేవాడు. కానీ అతని సెంచరీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అతనో నిస్వార్థపరుడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ ప్రపంచకప్ గెలవడంపైనే ఫోకస్ పెట్టాడని, ఇతరుల్లా సెంచరీల కోసం ఆడటం లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. పెయిడ్ పీఆర్ వల్ల ఆటగాళ్లకు వచ్చేదేం లేదని కూడా స్పష్టం చేశాడు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ.. సెంచరీల కోసం తెగ ఆరాట పడ్డాడు. సెంచరీ కోసం సింగిల్స్‌ కూడా తీయకుండా నిరాకరించాడు.

కోహ్లీ బ్యాటింగ్ అప్రోచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టు విజయం ఖాయమైన తర్వాత సెంచరీల కోసం ఆడితే తప్పేం ఉందని కొందరు ప్రశ్నించగా.. సెల్ఫీష్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(87), కేఎల్ రాహుల్ మినహా టాప్-5 బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్(9), విరాట్ కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(4) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా(1 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Sunday, October 29, 2023, 17:07 [IST]
Other articles published on Oct 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+