Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ్యూస్ కోసం హర్షిత్ రాణాపై విమర్శలా? సిగ్గుండాలి: గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్‌పై గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం యువ క్రికెటర్ అయిన హర్షిత్ రాణాపై విమర్శలు గుప్పిస్తారా? అని మండిపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన వన్డే, టీ20 జట్లలో హర్షిత్ రాణాకు చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

గౌతమ్ గంభీర్‌కు ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయని క్రిష్ శ్రీకాంత్‌తో పాటు పలువురు నెటిజన్లు ఆరోపించారు. మూడు ఫార్మాట్లలో ఆడే ప్రతిభ హర్షిత్ రాణాకు లేదని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హర్షిత్ రాణాపై వచ్చిన విమర్శలను గంభీర్ ముందు ప్రస్తావించగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Gautam Gambhir Slams Kris Srikkanth for Targeting Harshit Rana Just for YouTube Views

వాళ్ల అయ్య ఏం సెలెక్టర్ కాదు..

'యూట్యూబ్ వ్యూస్ కోసం 23 ఏళ్ల ఆటగాడిని విమర్శించేందుకు సిగ్గుండాలి. ఇలా మాట్లాడటం అన్యాయం. హర్షిత్ రాణా తండ్రి మాజీ చీఫ్ సెలెక్టర్ కాదు. మాజీ క్రికెటర్ కూడా కాదు. చివరకు ఎన్‌ఆర్‌ఐ కూడా కాదు. అతను ఎవరి మద్దతు లేకుండా తన సొంత ప్రతిభతో క్రికెట్ ఆడుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా లక్ష్యం చేస్తూ మాట్లాడటం సరికాదు. వారి ప్రదర్శన గురించి మాట్లాడండి. ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించేందుకు సెలెక్టర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ 23 ఏళ్ల యువకుడిపై ఘాటైన విమర్శలు చేస్తే.. అతని మానసిక స్థితి ఏం కావాలి?

మ్యాచ్ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలాంటి విమర్శలు వద్దు..

భవిష్యత్తులో మీ పిల్లలు క్రికెట్ ఆడి.. వారు వ్యక్తిగత దూషణకు గురైతే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అతను 23 ఏళ్ల కుర్రాడు. అతనిది 33 ఏళ్ల వయసు కాదు. హెడ్ కోచ్‌గా నన్ను విమర్శించండి. నేను భరించగలను. కానీ 23 ఏళ్ల కుర్రాడిపై అనవసర విమర్శలు చేయడం భావ్యం కాదు. భారత క్రికెట్ పట్ల నైతిక బాధ్యత ఉండాలి. మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం ఇలాంటి విమర్శలు చేయకూడదు. ఇది హర్షిత్ రాణా విషయంలోనే కాదు.. భవిష్యత్తులో ఏ ఆటగాడిపై కూడా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు.'అని క్రిష్ శ్రీకాంత్‌ను ఉద్దేశించి గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Tuesday, October 14, 2025, 13:36 [IST]
Other articles published on Oct 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+