Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఆటగాళ్లకు అది నూరిపోసిన గంభీర్!(వీడియో)

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు అన్ని విధాల సిద్దంగా ఉండాలని భారత ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన సరాన్ష్ జైన్, అకిబ్ నబీతో పాటు ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్‌కు స్వాగతం పలికాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2027 సైకిల్‌లో భాగంగా భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 9 టెస్ట్‌ల్లో భారత్ నాలుగు గెలిచి, నాలుగు ఓడింది. సౌతాఫ్రికా చేతిలో సొంతగడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ గంభీర్‌కు అగ్నిపరీక్షగా మారింది.

Gautam Gambhir Sends Strong Message to India Ahead of Must-Win Sri Lanka Test Series Says Tick All The Boxes

మన లక్ష్యం ఏంటో తెలుసు..

జట్టును ఉద్దేశించి మాట్లాడిన గంభీర్..ఈ సిరీస్ గెలవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది. 'గాయ్స్.. మన ముందున్న లక్ష్యం ఏంటో మనకు తెలుసు. మనం దేని కోసం ఆడుతున్నామో కూడా మనకు తెలుసు. మనం ఎంతైనా ఆడగలం. ఎలాంటి పరిమితలైనా అధిగమించగలం.

భారత జట్టును గంభీర్ గబ్బు పట్టిస్తున్నాడు: క్రిష్ శ్రీకాంత్

భారత జట్టును గంభీర్ గబ్బు పట్టిస్తున్నాడు: క్రిష్ శ్రీకాంత్

అన్ని విధాలుగా రాణించగలం. 15వ తేదీ ఉదయం.. మన ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా.. మనపై సంధించే ప్రతి ప్రశ్నకు, ప్రతీ సమాధానానికి మనం సంపూర్ణంగా సిద్దంగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనం అన్ని విధాలుగా రాణించేలా చూసుకుందాం.

వారికి స్వాగతం..

జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ స్వాగతం. మన జట్టులోకి ఇద్దరు కొత్త కుర్రాళ్లు వచ్చారు. ముందుగా సరాన్ష్ జైన్.. నీ అభినందనలు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డావు. నీకు అవకాశం దొరికినప్పుడల్లా నీ కుటుంబానికి, దేశానికి గర్వకారణంగా ఉండేలా చూసుకో.

రెండో ప్లేయర్ ఆకిబ్ నబి. అతన్ని ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. గత సీజన్‌లో అద్భుతంగా ఆడి జమ్మూ కశ్మీర్‌కు రంజీ ట్రోఫీని అందించారు. ఇది చాలా గొప్ప విజయం. మరోసారి అలాంటి ప్రదర్శన కనబర్చి భారత జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా. అలాగే ఫీల్డింగ్ కోచ్ జాయ్‌కి కూడా స్వాగతం పలుకుతున్నా.

అసలు సమస్య వదిలేసి గంభీర్‌ను బద్నాం చేయడం సరికాదు: మాజీ చీఫ్ సెలెక్టర్

Also Read

అసలు సమస్య వదిలేసి గంభీర్‌ను బద్నాం చేయడం సరికాదు: మాజీ చీఫ్ సెలెక్టర్

అతను చాలా ఏళ్లుగా ఎన్నో జట్లతో కలిసి పనిచేశాడు. అతని అభిరుచి, నిబద్ధత ఈ జట్టును ముందుకు నడిపిస్తాయిని, అలాగే మనం సాధించాలనుకుంటున్నలక్ష్యాన్ని చేరుకోవడానికి అతని శక్తి సామర్థ్యాలు అందరికీ సహాయపడుతాయని నేను నమ్ముతున్నాను.'అని గంభీర్ అన్నాడు. ఆగస్ట్ 15 నుంచి భారత్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Thursday, August 6, 2026, 14:29 [IST]
Other articles published on Aug 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+