Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ నువ్వు కేక: గంభీర్

Virat Kohli Must Be Applauded For Batting @ No.4 Says Gautam Gambhir || Oneindia Telugu
Gautam Gambhir Says Virat Kohli Should Be Applauded For Batting at Number Four

న్యూఢిల్లీ : రోహిత్, ధావన్, రాహుల్ ఓపెనర్ల త్రయం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయమే భారత్ కొంప ముంచిందని, నాలుగో స్థానంలో కోహ్లీ రావడం పెద్ద తప్పని మాజీ క్రికెటర్లు, విమర్శకులు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ తరహా పిచ్చి ప్రయోగాలతోనే మూల్యం చెల్లించుకున్నారని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలను టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. కోహ్లీ స్థానం మారడం వల్లే తొలి వన్డేలో ఓడిందనడం అర్థ రహితమన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్న కోహ్లీని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందేనని కొనియాడాడు.

'తమ బ్యాటింగ్ స్థానాలను వదిలేందుకు ఏ మాత్రం ఇష్టపడని ఆగాళ్లనుచూశా. వాళ్లకు జట్టు ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఈ ఆటగాళ్ల ఉద్వాసనకైనా సిద్ధపడేవాళ్లు గానీ బ్యాటింగ్ ఆర్డర్‌లో తమ స్థానాన్ని వదిలే వాళ్లు కాదు. అలాంటిది ఆసీస్‌తో తొలి వన్డేలో జట్టు కోసం నాలుగో స్థానంలో దిగిన కోహ్లీని అభినందించాల్సిందే. అన్నింటి కన్నా జట్టు ముఖ్యం. కెప్టెన్‌గా కోహ్లి కూడా అదే చెప్పాడు. కోహ్లి స్థానం మారడం వల్లే తొలి వన్డేలో ఓడిందనండం అర్థ రహితం. ఈ విమర్శలను నేనేమాత్రం అంగీకరించను. జట్టు సమతూకంలో ఇవన్నీ భాగం. 2011 వరల్డ్ కప్‌లో సచిన్-సెహ్వాగ్ జోడీ కోసం నేను మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాను. కోహ్లీ కెప్టెన్సీకి నేనేం ఫ్యాన్ కాదు. కానీ అతడు మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది.
రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

Story first published: Friday, January 17, 2020, 11:08 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+