Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: జట్టులో సీనియర్.. జూనియర్ ఎవడూ లేడు! నాకు అందరూ సమానమే!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు తమ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. జట్టులో ఎవరూ సీనియర్, జూనియర్ కాదని, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లేయర్ అనే తేడా కూడా లేదని, టీమ్‌లోని ప్రతీ ఒక్కరు సమానమేనని స్పష్టం చేశాడు.

గత రెండు సీజన్లలో కేకేఆర్ దారుణంగా విఫలమవడంతో తమ విన్నింగ్ కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్‌ను ఆ జట్టు మెంటార్‌గా నియమించుకుంది. ఇప్పటికే తన బాధ్యతలను చేపట్టిన గంభీర్.. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండీట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి టైటిగ్ గెలిచేందుకు కావాల్సిన ప్రణాళికలను రచిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పాడు.తాజాగా కేకేఆర్ టీమ్ మీటింగ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి స్పూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోను కేకేఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Gautam Gambhir says There is no senior-junior in KKR team for IPL 2024 with a resounding speech

సాయశక్తులా పోరాడండి..
'ఈ సీజన్‌ను మనం ఈ రోజే మొదలుపెడుతున్నాం. జట్టు కోసం భౌతికంగా, మానసికంగా.., నైపుణ్యం వారీగా.. సాధ్యమైనదంతా ఇవ్వండి. ఇది చాలా గర్వించదగిన ఫ్రాంచైజీ. సక్సెస్‌ఫుల్ టీమ్. మీరంతా విజయవంతమైన ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ట్రైనింగ్ అవ్వాలని భావించండి. అదే స్థాయిలో ఆడే ప్రయత్నం చేయండి. ఇది అందరికీ చాలా ముఖ్యం.

మన ఏకైక లక్స్యం అదే..
ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనివ్వడం నేను బాగా నమ్మే విషయం. జట్టు విజయాలు సాధించాలంటే ఆటగాళ్లు తమ సహజశైలిలో ఆడే స్వేచ్చనివ్వడం చాలా ముఖ్యం. జట్టులో ఆటగాళ్లందరికి నా గురించి చెప్పేది ఒక్కటే.. నేను అందరిని సమంగా చూస్తాను. జట్టులో సీనియర్-జూనియర్, దేశవాళీ, అంతర్జాతీయ ఆటగాళ్లనే తేడా లేదు. మనందరి లక్ష్యం ఒక్కటే ఐపీఎల్ టైటిల్ గెలవడం. అందరూ ఈ లక్ష్యంతోనే ముందుకు సాగాలి.

ఏ రాత్రి అయినా రావచ్చు..
మే 26న జరిగే ఫైనల్లో మనం ఆడాలి. దాని కోసం ఇప్పటి నుంచే సాయశక్తులా పోరాడాలి. ఇది 23 లేదా 26నో ప్రారంభించేది కాదు. ఈ రోజు నుంచే విజయం కోసం ప్రణాళికలు మొదలుపెట్టాలి. పోరాడితేనే విజయాలు దక్కుతాయి. కాబట్టి ఆటగాళ్లంతా స్వేచ్చగా ఉండండి. ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా సహజమైన ఆటను ఆడండి.

ఎవరి ముందైనా.. మా సలహాలు తీసుకోవచ్చు. సలహాలు, సూచనలకు మా సపోర్ట్ స్టాఫ్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలోనైనా మా గదిల్లోకి వచ్చి మాట్లాడవచ్చు. ఈ విషయంలో మేం నిజాయితీగా మీకు అండగా ఉంటాం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, March 16, 2024, 11:17 [IST]
Other articles published on Mar 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+