Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్.. కోహ్లీ స్థానంలో సూర్యను ఆడించాలి: గౌతమ్ గంభీర్

Gautam Gambhir says Suryakumar’s knock against SA best T20 innings ever by an Indian

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ భారత చరిత్రలోనే గొప్పదని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. టాప్-5 బ్యాటర్లు విఫలమైన వేళ తీవ్ర ఒత్తిడిలో సూర్య ఆడిన ఈ ఇన్నింగ్స్ గురించి ఎంత మాట్లాడిన తక్కువేనని అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దినేశ్ కార్తీక్(6)తో కలిసి 6వ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

నా జీవితంలోనే ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదు..

నా జీవితంలోనే ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదు..

ఇక అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్స్ స్పోర్ట్స్ చానెల్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడిన గంభీర్.. సూర్యను విరాట్ కోహ్లీకి బదులు మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించాలని సూచించాడు. 'ఇంతకంటే గొప్ప ఇన్నింగ్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యద్భుతమైన ఇన్నింగ్స్. ఐదు వికెట్లు కోల్పోయిన ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు ఏ మాత్రం సౌకర్యంగా లేని పిచ్‌పై అసాధారణ ఇన్నింగ్స్ ఆడటం గొప్ప విషయం.'అని చెప్పుకొచ్చాడు.

విరాట్ స్థానంలో ఆడించాలి..

విరాట్ స్థానంలో ఆడించాలి..

ఇక సూర్య ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ మరోసారి విరాట్ కోహ్లీని కించపరిచే ప్రయత్నం గంభీర్ చేశాడు. అతనిలా ఫామ్‌లోకి తిరిగి రావాలని ఎవరూ కోరుకోకున్నా సూర్య అదరగొడుతున్నాడని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో జట్టంతా విఫలమైనప్పుడు సూర్య రాణించాడని, వెస్టిండీస్ పర్యటనలోనూ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశాడు. అందరిలా 21, 22 పరుగులు చేయకుండా 30లతో రాణించాడని తెలిపాడు. బ్యాటింగ్ చేసేందుకు అతనికి తగిన సమయం లభించడం లేదని వెంటనే మూడో స్థానంలో ఆడించాలని సూచించాడు.

ఒక్కసారి మూడో స్థానంలో ఆడించండి..

ఒక్కసారి మూడో స్థానంలో ఆడించండి..

విరాట్ కోహ్లీ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడని, అతను నాలుగో స్థానంలో కూడా ఆడగలడని చెప్పాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఆడే సామర్థ్యం విరాట్‌కు ఉన్నందున సూర్యను మూడో స్థానంలో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. కనీసం ఈ వరల్డ్ కప్‌లోనైనా సూర్యను మూడో స్థానంలో ఆడించి ఫలితం చూడాలని కోరాడు.

విరాట్ కంటే సూర్య బెస్ట్ బ్యాట్స్‌మన్

విరాట్ కంటే సూర్య బెస్ట్ బ్యాట్స్‌మన్

నెదర్లాండ్స్‌పై విజయానంతరం సూర్య బ్యాటింగ్‌ను కొనియాడిన గంభీర్.. విరాట్ కోహ్లీ కంటే అతనే గొప్ప బ్యాట్స్‌మన్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో సూర్య ఇన్నింగ్స్ విశ్లేషించిన గంభీర్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్ యాదవ్‌కు లేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారు.'అని పేర్కొన్నాడు.

Story first published: Monday, October 31, 2022, 13:41 [IST]
Other articles published on Oct 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+