న్యూఢిల్లీ: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఆసియాకప్‌కు ఎంపిక చేయడాన్ని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డాడు. శార్ధూల్ ఠాకూర్ అరకొర ఆటగాడని, హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతను పనికిరాడని చెప్పాడు.
శార్దూల్ ఠాకూర్‌కు బదులు శివమ్ దూబేను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023 నేపథ్యంలో ఓ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. శార్దూల్ ఠాకూర్‌ను కించపరిచేలా మాట్లాడాడు.

'శార్దూల్ ఠాకూర్ అరకొర ఆటగాడు. అతను హార్దిక్ పాండ్యాకు ఏ విధంగానూ బ్యాకప్ కాదు. హార్దిక్ లేని లోటును ఏ మాత్రం తీర్చలేడు. శార్దూల్‌కు బదులు శివమ్ దూబేను సెలెక్టర్లు ఎంపిక చేయాల్సింది. శివమ్ దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లను తన బ్యాటింగ్‌తో గెలిపించాడు.
సునాయసంగా సిక్సర్లు బాదగలడు. హార్దిక్ పాండ్యాకు అలాంటి ఆటగాడిని బ్యాకప్‌గా తయారు చేసుకోవాలి. శార్దూల్ ఠాకూర్‌కు వన్డే ప్రపంచకప్ ఆడేంత సీన్ లేదు. అప్పుడప్పుడు ఆడపాదడపా మ్యాచ్‌లు గెలిపించినా.. హార్దిక్ పాండ్యాలా మ్యాచ్ విన్నర్ అయితే కాదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఉద్దేశపూర్వకంగా శార్దూల్ ఠాకూర్‌ను తక్కువ చేసే ప్రయత్నం గంభీర్ చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో శార్దూల్ ఠాకూర్‌తో గంభీర్ గొడవపడ్డాడని, ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని అతనిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
2015 రంజీ ట్రోఫీ సందర్భంగా గంభీర్, శార్దూల్ ఠాకూర్ మైదానంలో గొడవపడ్డారు. 441 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ, 100 పరుగులు కూడా చేయకుండా 4 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను ముంబై బౌలర్ అయిన శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. గంభీర్ వికెట్ తీసిన ఆనందంలో కుర్రాడైన శార్దూల్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. గంభీర్ సహించలేకపోయాడు.

అతనిపై బ్యాట్ లేపుతూ దూసుకెళ్లగా.. శార్దూల్ కూడా ధీటుగా బదులిచ్చాడు. దాంతో వాగ్వాదం చోటు చేసుకోగా అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని గంభీర్‌కు సర్దిచెప్పి బయటకు పంపించారు. ఈ గొడవను మనుసులో పెట్టుకొనే అవకాశం వచ్చినప్పుడల్లా గంభీర్.. అతన్ని విమర్శిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతోనే ఇలానే గొడవపడిన గంభీర్.. అవకాశం వచ్చినప్పుడల్లా అతన్ని విమర్శిస్తూనే ఉంటాడన్న విషయం తెలిసిందే.