ఐపీఎల్‌లో అతడి వల్ల నిద్రలేని రాత్రులు గడిపా: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వల్లనే తాను ఐపీఎల్‌లో నిద్రలేని రాత్రులు గడిపానని మాజీ ఓపెనర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అతని కోసమే ప్రత్యేక ప్రణాళికలు రచించేందుకు బుర్ర బద్దలు కొట్టుకునేవాడినని తెలిపాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంభీర్.. సహచర వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
'నీ సారథ్యంలోని కేకేఆర్ మరింత పటిష్టంగా మారేందుకు ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకోమంటే ఎవర్నీ తీసుకుంటావ్?'అని సహచర కామెంటేటర్ ప్రశ్నించగా.. రోహిత్ శర్మ, యువరాజ్‌లను ఎంచుకుంటానని గంభీర్ బదులిచ్చాడు.

ఆ ఇద్దరూ ఉంటే..
'ఇది చాలా కఠినమైన ప్రశ్నే. కానీ సమాధానం చాలా సులువు. నన్ను ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకోమంటే.. సులువుగా సమాధానం చెబుతాను. నా ఫస్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ. రెండో ప్లేయర్ యువరాజ్ సింగ్. ఈ ఇద్దరికి మించి మరే ప్లేయర్ నాకు అక్కర్లేదు. ఈ ఇద్దరితోనే మా జట్టు పర్‌ఫెక్ట్‌గా తయారవుతుందని చెప్పడం లేదు. కానీ ఈ ఇద్దరు మా జట్టులో ఉంటే మరిన్ని టైటిళ్లు సాధించేవాళ్లం.

సాలిడ్ లైనప్..
ఈ ఇద్దరూ కూడా మా జట్టులో ఉండి ఉంటే రోహిత్‌తో కలిసి నేను ఓపెనింగ్ చేసేవాడిని. రాబిన్ ఊతప్ప మూడో స్థానంలో ఆడేవాడు. సూర్య, యువరాజ్, యూసఫ్ పఠాన్, ఆండ్రీ రస్సెల్ వరుసగా 4, 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారు. ఒక్క సారి ఈ లైనప్‌ను ఊహించుకో ఎలా ఉంటుందో. యువరాజ్ కోసం మేం చాలా ప్రయత్నించాం. కానీ అతను మాకు దక్కలేదు.

రోహిత్ వల్ల నిద్రలేని రాత్రులు..
ఐపీఎల్‌లో నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. ఇతర ఆటగాళ్లకు నాకు ప్రణాళికలు కూడా అవసరమవ్వలేదు. వారి గురించి పెద్దగా ఆలోచించింది కూడా లేదు. నా అభిప్రాయం ప్రకారం యువరాజ్ సింగ్ భారత్‌లోనే గొప్ప వైట్‌బాల్ క్రికెటర్. వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పెర్ఫామెన్స్ కనబర్చాడని ఇలా చెప్పడం లేదు. అతని అపారమైన ప్రతిభ, సామర్థ్యంతోనే అతను బెస్ట్ వైట్ బాల్ క్రికెటరని చెబుతున్నా'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

గంభీర్ తర్వాత ఒక్క టైటిల్ లేదు..
గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్.. 2012, 2014లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. గంభీర్ కెప్టెన్సీలో మొత్తం 122 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. 69 విజయాలు సాధించింది. గంభీర్ తర్వాత కేకేఆర్‌ను దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌లు నడిపించినా మరో టైటిల్ అందించలేకపోయారు. మోర్గాన్ సారథ్యంలో ఐపీఎల్ 2021లో ఆ జట్టు ఫైనల్ చేరినా విజయాన్నందుకోలేకపోయింది. ఐపీఎల్ 2022లో శ్రేయస్ అయ్యర్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించినా ఆ జట్టు రాత మారలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications