Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ ముందు రికీ పాంటింగ్ జుజూబీ.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

 Gautam Gambhir says Rohit Sharma is a better player than Ricky Ponting before IND vs SL 2nd ODI

న్యూఢిల్లీ: నచ్చనివాళ్లపై విమర్శలు గుప్పించడం..ఫేవరేట్ ఆటగాళ్లను ఆకాశానికెత్తడం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌కు అలవాటనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే గౌతం గంభీర్.. అదే సమయంలో రోహిత్ శర్మ గొప్ప ఆటగాడంటూ ప్రశంసలు కురిపిస్తుంటాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీకి పోలిక ఏంటని ఇటీవలే ప్రశ్నించిన గంభీర్.. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో రోహిత్ శర్మను పోల్చాడు. అప్పటి ఆటకు ఇప్పటి ఆటకు చాలా తేడా ఉందని, నిబంధనలు బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయని విరాట్ కోహ్లీ తక్కువ చేసి మాట్లాడిన గంభీర్.. రోహిత్ శర్మ మాత్రం పాంటింగ్ కంటే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు.

రోహిత్ శర్మనే గొప్ప..

రోహిత్ శర్మనే గొప్ప..

గంభీర్ రెండు నాల్కల ధోరణిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో రెండో వన్డే ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో రికీ పాంటింగ్‌తో రోహిత్ శర్మను పోలుస్తూ వాడి వేడి చర్చకు తెరలేపాడు. పాంటింగ్ కంటే రోహిత్ శర్మనే గొప్ప ఆటగాడని కీర్తించాడు. సహచర ఆటగాళ్ల అభిప్రాయాలను కూడా బేఖాతరు చేశాడు. 'రికీ పాంటింగ్ కంటే రోహిత్ శర్మనే గొప్ప ఆటగాడు. ఏ విషయంలో చూసుకున్నా పాంటింగ్ కంటే రోహిత్‌కే మెరుగైన రికార్డు ఉంది. ముఖ్యంగా ఉపఖండంలో రికీ పాంటింగ్‌కు చెత్త రికార్డు ఉంది.

 మరో 20 సెంచరీలు బాదుతాడు..

మరో 20 సెంచరీలు బాదుతాడు..

అదే రోహిత్ శర్మకు విదేశాల్లో ఘనమైన రికార్డు ఉంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే రోహిత్ శర్మ గత నాలుగైదు ఏళ్లలోనే ఎక్కువ సెంచరీలు చేశాడు. అతను ఎక్కువ మ్యాచులు ఆడింది విదేశాల్లోనే. మరో ఐదు, ఆరు, ఏడేళ్లు ఆడితే ఈజీగా మరో 20 సెంచరీలు కొట్టగలడు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో విదేశాల్లో 13 వన్డే సెంచరీలు సాధించాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అదే పాంటింగ్ తన కెరీర్‌లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో మొత్తం 6 సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రెండు ప్రపంచకప్‌లు..

రెండు ప్రపంచకప్‌లు..

ఓ ఆటగాడు ఎన్ని పరుగులు చేశాడనేదాని కంటే ఎన్ని ప్రపంచకప్‌ విజయాల్లో భాగమయ్యాడనేదే ముఖ్యమని చెప్పే గంభీర్.. రికీ పాంటి రెండు ప్రపంచకప్‌లు అందించాడనే విషయం మరిచిపోయాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు బాదిన రికీ పాంటింగ్, సారథిగా ఆస్ట్రేలియాకి రెండు వన్డే వరల్డ్ కప్స్ అందించాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేలకు పైగా పరుగులు చేసిన రికీ పాంటింగ్, వన్డేల్లో 30 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 29 సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ, రికీ పాంటింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు.

మూడేళ్లుగా వన్డే సెంచరీ లేదు..

మూడేళ్లుగా వన్డే సెంచరీ లేదు..

2013లో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న రోహిత్.. అప్పటి నుంచి వెనక్కి చూసుకోలేదు. రికార్డు స్థాయిలో వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ, తన వన్డే కెరీర్‌లో 236 మ్యాచులు ఆడి 9537 పరుగులు చేశాడు. మరో 436 పరుగులు చేస్తే 10 వేల క్లబ్‌లో చేరతాడు. 2017 నుంచి రోహిత్ శర్మ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు పదేళ్లలో 10 సెంచరీలు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, 2017-2020 మధ్యలో ఏకంగా 19 వన్డే సెంచరీలు బాదాడు... అయితే 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ, మూడేళ్లుగా ఆ మార్కు అందుకోలేకపోతున్నాడు.

Story first published: Thursday, January 12, 2023, 19:11 [IST]
Other articles published on Jan 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+