For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్‌పై గంగూలీ కన్నా ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ: గంభీర్

Gautam Gambhir Says Rahul Dravid had much bigger impact in Indian cricket than Sourav Ganguly

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కన్నా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ప్రభావమే ఎక్కువని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ అనగానే అందరూ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతుంటారని కానీ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా చాలా కీలకమని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

క్రెడిట్ దక్కలేదు..

క్రెడిట్ దక్కలేదు..

‘సౌరవ్ గంగూలీ సారథ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన నేను.. రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో టెస్ట్ కెరీర్‌ను మొదలుపెట్టా. కానీ దురదృష్టవశాత్తు అతని కెప్టెన్సీకి ఏ ఒక్కరూ క్రెడిట్ ఇవ్వడం లేదు. కేవలం గంగూలీ, ధోనీ, విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతున్నాం. కానీ ద్రవిడ్ కూడా గొప్ప సారథనే విషయాన్ని గ్రహించాలి.

నిస్వార్థ ఆటగాడు..

నిస్వార్థ ఆటగాడు..

టెస్ట్ క్రికెట్‌లో ద్రవిడ్‌ను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయమన్నా చేసేవాడు. అలాగే కీపింగ్, ఫినిషర్‌గా జట్టుకు అవసరమైన సమయాల్లో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. ఇలా భారత క్రికెట్‌కు ఎన్నో చేశాడు. నా దృష్టిలో భారత క్రికెట్‌పై ద్రవిడ్ ప్రభావం ఎక్కువే. వైట్ బాల్ క్రికెట్‌లో గంగూలీ ప్రభావం ఎక్కువే కానీ.. ఓవరాల్ క్రికెట్‌లో మాత్రం అందరి కన్నా ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ. సచిన్ టెండూల్కర్ నీడలోనే ఆడటంతో అతనికి దక్కాల్సిన గుర్తింపు కూడ దక్కలేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

2007 ప్రపంచకప్ ఓటమితో..

2007 ప్రపంచకప్ ఓటమితో..

ఇక మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత జట్టు బాధ్యతలు అందుకున్న దాదా.. జట్టును అద్భుతంగా నడిపించాడు. సీనియర్లు సచిన్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్‌ల సాయంతో జట్టుకు ఎన్నో విజయాలందించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడు. 2003 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గంగూలీ తర్వాత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ మ్యాచ్‌ విజయాన్నందించాడు. అనంతరం 2006, 2007లో సొంతగడ్డపై ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను ఓడించాడు. అయితే 2007 వరల్డ్‌కప్ ఘోర పరాభావం అతని విజయాలకు గుర్తింపులేకుండా చేసింది.

Story first published: Sunday, June 21, 2020, 18:24 [IST]
Other articles published on Jun 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+