
ముంబైకి అడ్వాంటేజ్..
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్లు తమ స్వింగ్‌తో చెలరేగుతారని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఆ జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారని గుర్తుచేశాడు. ఇప్పటికే టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన రోహిత్ జట్టు ఇకపై జరిగే ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు గెలవాలన్నాడు. దాంతో మిగిలిన మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోదని వివరించాడు. 'దుబాయ్‌లో ముంబై ఇండియన్స్ ఆట భిన్నంగా ఉంటుంది.
వాంఖడేలో ఆడినట్లుగానే ఉంటుంది. యూఏఈ పరిస్థితులు ముంబై ఫాస్ట్ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌కు అక్కడి పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. దాంతో అక్కడ వారు ప్రమాదకరంగా మారుతారు. వారి బ్యాట్స్‌మన్ సైతం యూఏఈలో రాణించగలరు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా టర్నింగ్ కలిగిన చెపాక్ పిచ్ ఇబ్బంది పడినప్పటికీ యూఏఈలో చెలరేగుతారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ రఫ్ఫాడించగలడు..
ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ అసలైన బ్యాటింగ్ మనమింకా చూడలేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. అతను ఈ టీ20 లీగ్‌లో పరుగులు తీస్తున్నా.. అతని పూర్తి సామర్థ్యం మనకు కనబడలేదన్నాడు. కోహ్లీ 2016లో ఆడినట్లు రాహుల్ కూడా అలా ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడని అంచనా వేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అతడు 2, 3 సెంచరీలు సాధించగల సత్తా ఉన్నవాడని చెప్పుకొచ్చాడు.
'మనం ఇప్పటి వరకు రాహుల్ పూర్తి సామర్థ్యం చూడలేదు. పరుగులు చేస్తున్నప్పటికి అతని సామర్థ్యానికి తగిన ఆట మాత్రం ఇంకా ఆడలేదు. విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో చెలరేగినట్లు రాహుల్ కూడా ఆడగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను సులువుగా 2-3 సెంచరీలు బాదగలడు. కాకపోతే పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో అతనిపై ఒత్తిడి నెలకొంటుంది.

ఆర్‌సీబీకి కష్టమే..
గత సీజన్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్‌పై రాహుల్ నమ్మకం ఉంచినప్పటికీ అతను రాణించలేకపోయాడు. ఈసారి నికోలస్ పూరన్ నమ్ముకోగా అతనూ విఫలమయ్యాడు. నమ్మకం కలిగిన అంతర్జాతీయ ఆటగాళ్లు రాణించకపోతే కెప్టెన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు సవాళ్లు ఎదురవుతాయని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, మరోవైపు డివిలియర్స్ ఇటీవల కాలంలో క్రికెట్ ఆడలేదని గుర్తుచేశాడు. దాంతో వీరిద్దరికీ కష్టతరమవుతుందని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే ఫస్టాఫ్‌లో రాణించిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ యూఏఈలో ఎలా రాణిస్తాడో అనేది చూడాలన్నాడు.


Click it and Unblock the Notifications
