ధోనీ కూడా వరల్డ్ కప్స్‌లో విఫలమయ్యాడు.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై నమ్మకం ఉంది: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అండగానిలిచాడు. ఒక్క ప్రపంచకప్ టోర్నీలో విఫలమైనంత మాత్రానా రోహిత్ సారథ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా నాలుగు ప్రపంచకప్ టోర్నీల్లో విఫలమయ్యాడని గుర్తు చేశాడు. ఆటగాళ్లను తరుచూ మార్చడం, సిరీస్‌కు ఒక కెప్టెన్ నియమించడమే టీమిండియా వైఫల్యానికి కారణమని చెప్పాడు. టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ శ్రీలంక సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను దూరం పెట్టిన బీసీసీఐ.. వన్డే జట్టుకు ఎంపిక చేసింది.

ఒక్క ప్రపంచకప్‌కే..
హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎంపికచేయడంపై స్పందించిన గంభీర్.. రోహిత్‌ను టీ20ల్లో పక్కనపెట్టారని తాను అనుకోవడం లేదన్నాడు. 'ఒక్క వరల్డ్ కప్‌లో విఫలమైనంత మాత్రాన రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్‌ను తక్కువ చేయడానికి లేదు. అతనికి కెప్టెన్సీ స్కిల్స్ లేకపోతే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ ఎలా గెలవగలిగాడు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా నాలుగు వరల్డ్ కప్స్‌లో టైటిల్స్ సాధించలేకపోయాడు. అంతమాత్రాన ధోనీ కెప్టెన్సీని తప్పుబట్టగలమా? రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది.

ఆటగాళ్లను మార్చడంతోనే..
భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. ఏడాదిలో ఎంతో మంది ప్లేయర్లను మార్చారు. కెప్టెన్లను మార్చారు. ఐసీసీ టైటిల్స్ గెలవాలంటే ఓ స్థిరమైన జట్టు కావాలి. ప్రతీ సిరీస్‌కోసారి ప్లేయర్లు బ్రేకులు తీసుకుంటూ ఉంటే టీమ్ ఎలా సెటిల్ అవుతుంది. వరల్డ్ కప్ ఆడాలనుకుంటే కోర్ టీమ్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వకూడదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా వరుసగా సిరీస్‌లు ఆడాల్సిందే. ఏ ప్లేయర్ అయినా ఒక్కటి రెండు సిరీస్‌లు ఆడిన తర్వాత రెస్ట్ కావాలంటే అతన్ని వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పించాలి. అతను రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ ఆడాలంటే టీమిండియా ఆడే అన్ని సిరీసుల్లో పాల్గొని తీరాల్సిందే.

కోహ్లీ టీ20ల్లోకి కష్టం..
కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి టీ20ల్లో స్థానం దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. వాళ్లు కుర్రాళ్లతో పోటీపడి పరుగులు చేయగలిగితేనే పొట్టి ఫార్మాట్‌లో చోటు దక్కించుకోగలుగుతారు. రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారని నేను అనుకోవడం లేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ సారథ్యాన్ని పదే పదే విమర్శించిన గంభీర్.. రోహిత్ శర్మ కెప్టెన్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశాడు. ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిచిన సారథి రోహిత్ శర్మని చెప్పుకొచ్చిన గంభీర్.. ఐసీసీ టైటిల్ గెలిచే సత్తా అతనికే ఉందన్నాడు. రోహిత్ విఫలమైనా.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications