Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రోఫీలు గెలవడమే నా పని.. వారి అభిప్రాయాలు, ఇష్టాలు అక్కర్లేదు: గౌతమ్ గంభీర్

టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఇబ్బందులు పడుతుందనే వాదనను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తోసిపుచ్చాడు. ఇటీవల ఎదురైన టెస్ట్ పరాజయాలను జట్టు పతనానికి నిదర్శనంగా కాకుండా.. టీమ్ పరివర్తన దశలో భాగంగా చూడాలని తెలిపాడు. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.

గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా ట్రోఫీలు గెలవడమే తన పనని, ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలతో తనకు పనిలేదన్నాడు.

అందుకే గౌతమ్ గంభీర్ ఎవరికీ నచ్చడం లేదు: హర్భజన్ సింగ్

అందుకే గౌతమ్ గంభీర్ ఎవరికీ నచ్చడం లేదు: హర్భజన్ సింగ్

ర్యాంకులు అవసరం లేదు..

'ర్యాంకింగ్స్ ముఖ్యం కాదు. టెస్ట్‌ల్లో టీమిండియా ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. ఇంగ్లండ్ పర్యటన నుంచి మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. హెడ్ కోచ్‌గా నా దృష్టిలో జట్టు పురోగతికి అంతిమ కొలమానం.. ర్యాంకింగ్స్, వ్యక్తిగత ప్రదర్శనల చుట్టూ ఉండే హడావిడి కాదు. జట్టు ట్రోఫీలు గెలవగలదా లేదా అన్నదే ముఖ్యం. ట్రోఫీలు గెలవడమే కోచ్‌గా నా పని. నేను పట్టించుకునేది, నమ్మేది కూడా అదొక్కటే. ఇతరుల అభిప్రాయాలు, ఇష్టాలతో నాకు పనిలేదు.' అని గంభీర్ స్పష్టం చేశాడు.

Gautam Gambhir Says My Job Is to Win Trophies Not Likes and Views Ahead of India vs Sri Lanka 2nd Test

రెండో టెస్ట్ కాంబినేషన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? కుల్దీప్ యాదవ్‌ను కొనసాగిస్తారా? అనే ప్రశ్నలకు గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 20 వికెట్లు తీయగల బౌలింగ్ కాంబినేషన్‌‌పైనే భారత తుది జట్టు ఎంపిక ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు.

అది శుభ్‌మన్ గిల్ ఇష్టం..

'మేం 20 వికెట్లు తీయగల అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తాం. కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్. కొన్నిసార్లు తుది జట్టు ఎంపిక కెప్టెన్‌ నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రికెట్‌లో ఒడిదుడుకులు సహజం. మనం మన ఆటగాళ్లకు అండగా నిలిచి వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఒకటి రెండు మ్యాచ్‌లకే ఆటగాళ్లను పక్కనపెట్టడటం సరికాదు. అది నా విధానం కూడా కాదు.

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

Also Read

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

మూడు మ్యాచ్‌‌ల సిరీస్ నిర్వహించాలి..

రెండు టెస్ట్‌ల సిరీస్ కంటే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తక్కువ గ్యాప్‌లో మ్యాచ్‌లు ఉన్నా పర్లేదు. మా శరీరాలను ఎలా సమన్వయం చేసుకోవాలి, రికవర్ ఎలా అవ్వాలో మాకు తెలుసు. అందుకే ప్లేయర్లకి ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తూ.. బౌలర్లకి రెస్ట్ ఇస్తుంటాం. నాకైతే మూడు టెస్ట్‌ల సిరీస్ ఏ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి తొలి టెస్ట్ ఓడిన తర్వాత ప్రత్యర్థి టీమ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉండదు.

మహా అయితే డ్రా చేసుకోవడం తప్పా వారికి మరో ఛాన్స్ లభించదు. అదే మూడు టెస్ట్‌ల సిరీస్ అయితే తొలి టెస్ట్ ఓడినా సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. గాలే పిచ్ బాగుంది. అది మంచి టెస్ట్ క్రికెట్ వికెట్. అక్కడ ఆడటం మాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొలంబో పిచ్ కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా. గాలె టెస్ట్ ఒక పరిపూర్ణమైన టెస్ట్ మ్యాచ్ కాదు. కానీ టెస్ట్ మ్యాచ్‌లు అలాగే ఆడుతారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 22, 2026, 15:09 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+