
భారత్-ఏ తరఫున..
2004 భారత్-ఏ కెన్యా పర్యటన సందర్భంగా మహీని తొలిసారి కలిసానన్న గంభీర్.. ఆ సీరిస్‌లో భారత మాజీ కెప్టెన్ ఆడిన తీరును గుర్తు చేసుకున్నాడు. బంతిని మైదానం బయట కొట్టాడని, అప్పుడే అతను అందరిలా సాధారణ వికెట్ కీపర్ కాదని, సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ ఉంటుందని అనుకున్నానని తెలిపాడు. బంతిని బలంగా బాదే సామర్థ్యమే ధోనీ సక్సెస్‌కు కారణమని చెప్పుకొచ్చాడు.

ధోనీలా హిట్టర్లు లేరు..
‘ధోనీ, నేను భారత్ ఏ తరఫున జింబాబ్వే, కెన్యా పర్యటనకు వెళ్లాం. పాకిస్థాన్ ఏ, కెన్యా ఏతో ముక్కోణపు సిరీస్ ఆడాం. ఆ సిరీస్‌లో ధోనీ బంతిని కొట్టిన విధానం చూసి.. టీమిండియాకు చాలా రోజు ఆడగలిగే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అనుకున్నాం. మన కీపర్లు ఇలా ఆడటం సాధారణ విషయం కాదు. ఎందుకంటే అప్పటి వరకు మన దగ్గర అద్భుతమైన కీపర్లు ఉన్నారు. కానీ ధోనీలా 100 మీటర్ల సిక్స్ కొట్టగలిగే హార్డ్ హిట్టర్లు లేరు. ధోనీ అసాధారణమైన ఆటగాడు. ఆ హిట్టింగ్ సామర్థ్యమే అతని సక్సెస్‌కు కారణం.

16 ఏళ్ల క్రితం ఇదే రోజు..
2000-10 మధ్య భారత క్రికెట్ జట్టులో ధోనీ, గంభీర్‌లు కీలక ఆటగాళ్లు. ఈ ఇద్దరు కలిసి మైదానంలో ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో వీరు ఆడిన తీరు అమోఘం. ఇక భారత్-ఏ తరఫున కెన్యా పర్యటనకు వెళ్లిన మహీ.. ఆ టూర్‌లో రెండు సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో సెలెక్టర్ల దృష్టి ఆకర్షించి.. 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 23, 2004) బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లో పరుగులేమి చేయకుండా రనౌట్‌గా వెనుదిరిగినా.. ఆ తర్వాత తన మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చాడు.

ఏకైక సారథి..
తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో చిరస్మరణీయాలు అందించాడు. కూల్ కెప్టెన్సీతో ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక సారథిగా రికార్డు సృష్టించాడు. 2007 ట20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు గెలిపించిన ధోనీ.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న మహీ.. ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 2004-2019 వరకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 17 వేలకు పైగా పరుగులు చేశాడు. కీపర్‌గా 800పైగా వికెట్లలో పాలుపంచుకున్నాడు.


Click it and Unblock the Notifications












