Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వల్ల ప్రపంచకప్‌లు రాలేదు.. అసలు సిసలు హీరో అతనే: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్ల 2007, 2011 ప్రపంచకప్‌లను టీమిండియా గెలుచుకోలేదని, సమష్టిగా రాణించడంతోనే ఈ విజయాలు దక్కాయని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. కానీ ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని హీరో చేసిందని మండిపడ్డాడు. ఈ రెండు టోర్నీల్లో టీమిండియా గెలవడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అని గంభీర్ స్పష్టం చేశాడు.

ఈ రెండు విజయాల వెనుక ఉన్న అసలు హీరో అతనేనన్నాడు. కానీ యువీకి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఐసీసీ ట్రోఫీల్లో నెగ్గడం ధోనీకే సాధ్యమని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చెలరేగుతుండటంపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.

Gautam Gambhir MS Dhoni

ధోనీ ఒక్కడి వల్లనే టీమిండియా ప్రపంచకప్‌లు గెలవలేదన్నాడు. 'ఐసీసీ టోర్నీల్లో భారత వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడం వల్లే. ఇతర జట్లు మాత్రం సమష్టి ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిందంటే ఆల్‌రౌండర్ యువరాజ్ సింగే ప్రధాన కారణం. ఈ రెండు టోర్నీల్లోనూ యువరాజ్ సింగ్ అసాధారణ ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ పీఆర్ ఏజెన్సీ బృందాలు మాత్రం ధోనీని హీరోని చేసేశాయి.

ప్రపంచకప్ గెలుస్తానని యువీ తరుచూ చెబుతుండేవాడు. 2011, 2007 ప్రపంచకప్‌ల్లో అతనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడనుకుంటా. నాకు అంతగా గుర్తులేదు. (2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో షాహిద్ అఫ్రిదిని ఈ అవార్డు వరించింది.)

కానీ 2007, 2011 ప్రపంచకప్ గురించి మాట్లాడుకున్నప్పుడు యువరాజ్ సింగ్ ప్రస్తావన తీసుకురాం. ఎందుకంటే పీఆర్ బృందం పనికట్టుకొని ఈ విజయాల క్రెడిట్ ధోనీకి మాత్రమే దక్కేలా చేసింది. ఇతరుల పాత్రనే లేనట్లుగా చిత్రీకరించింది. సమష్టి ప్రదర్శనలతోనే ఆ విజయాలు దక్కాయి. బిగ్ టోర్నీలు గెలవడం ఒక్కడి వల్ల సాధ్యం కాదు.

అదే నిజమైతే.. భారత్ ఇప్పటికే 5-10 ప్రపంచకప్‌లు గెలిచి ఉండాల్సింది. చాలా మంది ఈ నిజం చెప్పరు. ఇప్పటికైనా వ్యక్తి పూజ మానేసి జట్టు ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయినా అతనికి దక్కాల్సిన క్రెడిడ్ దక్కలేదు.

Story first published: Tuesday, June 13, 2023, 15:11 [IST]
Other articles published on Jun 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+