
యువ ఆటగాళ్లపై ఒత్తిడి..
దాయదీతో పోరంటే ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం సహజమని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నాడు. యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గేలా ఆడాలని సూచించాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీ ఇన్నింగ్స్‌లు ఆడిన గంభీర్.. పాకిస్థాన్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. ఉత్సాహంగా బరిలోకి దిగన తాను కొంచెం నర్వస్‌గా ఫీలైనట్లు చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ స్పెషల్ షోలో పాల్గొన్న గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రోహిత్, కోహ్లీలదే బాధ్యత..
'పాకిస్థాన్‌తో ఆడిన నా తొలి మ్యాచ్‌లో ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగాను. అయితే పాకిస్థాన్‌తో ఆడిన అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లతో పోలిస్తే నేను కొంచె నర్వస్‌గా ఫీలైనట్లు అనిపించింది. దాయాదీతో మ్యాచ్ అంటే యువ ఆటగాళ్లపై ఒత్తిడి ఉండటం సహజం. కాబట్టి సీనియర్ ఆటగాళ్లు యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇరు దేశాల మధ్య ఉండే భావోద్వేగాల సమ్మేళనం. కేవలం బ్యాట్, బంతి మధ్య జరిగే పోటీ కాదు అంత కంటే ఎక్కువ. కాబట్టి పాకిస్థాన్‌తో తలపడినప్పుడు భారత్ గెలుపు బాధ్యత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలదే'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఆ క్రేజ్ వేరు..
ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజే వేరేనని భారత్ వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తికరంగా చూస్తుందన్నాడు. 'భారత్-పాక్ మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం. గెలుపు అంచనాలు ఉండనే ఉంటాయి. గతంలో ఆడిన, ఇప్పుడు ఆడుతున్న క్రికెటర్లు సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ పోరు ఇరు దేశాల భావోద్వేగాలను బయటకు తీస్తోంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

ఒకే గ్రూప్‌లో భారత్Xపాక్
యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్‌లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్.. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పోటీపడుతుండగా, మరోవైపు గ్రూప్-2లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది.


Click it and Unblock the Notifications
