IPL 2021 Auction: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన సమస్య అదే.. పోటీలో నిలవాలంటే?: గంభీర్

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడకపోవడమే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ప్రధాన సమస్యగా మారిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. కోల్‌కతా జట్టులో శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయట్లేదన్నారు. దీంతో ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్‌పై భారం పెరుగతుందన్నారు. దినేశ్ కార్తిక్ గొప్ప ప్రదర్శనలు చేయాలని సూచించారు. ఐపీఎల్ 2020లో కేకేఆర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ప్లేఆఫ్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

అదే ప్రధాన సమస్య:
తాజాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'భారత ఆటగాళ్ల బ్యాటింగ్ కోల్‌కతాకు ప్రధాన సమస్య ఉంది. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా మినహా ఎవరూ తీవ్రత చూపట్లేదు. దినేశ్ కార్తిక్ గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడట్లేదు. గత సీజన్‌లో కార్తీక్ పేలవ ప్రదర్శన చేశాడు. అందుకే కోల్‌కతా ఇయన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే వాళ్లు పోటీలో నిలవాలంటే రసెల్ ధాటిగా ఆడాల్సి ఉంది. పేపర్‌పై ఆ జట్టు ఎంతో బలంగా ఉన్నప్పటికీ నిలకడగా ఆడలేకపోతోంది' అని అన్నారు.

బ్యాటింగ్ లైనప్‌లో సమస్యలు:
'మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్ లాంటి భారత బ్యాట్స్‌మన్ ఉంటే కోల్‌కతాకు మేలుగా ఉంటుంది. అందుకే అనుభవజ్ఞుడు కరుణ్ నాయర్‌ను వేలంలో తీసుకున్నారు. కానీ కేదార్ మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు సాధిస్తాడు. ప్రస్తుతం కోల్‌కతాకు రాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్ ఉన్నారు. కానీ కరుణ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే వాళ్ల బ్యాటింగ్ లైనప్‌లో సమస్యలు తలెత్తుతాయనిపిస్తోంది. ఇక ఓపెనర్లుగా బరిలోకి దిగేదెవరు? గిల్‌తో మరోసారి నరైన్‌ను పంపిస్తారా?' అని గౌతీ పేర్కొన్నారు.

సంతోషించేవాడిని కాదు:
గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ను జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్మిత్‌ను రూ.2.2కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రన్ హెట్‌మెయిర్, మార్కస్ స్టోయినిస్, అన్‌రిచ్ నోర్జె, కాగిసో రబాడ ఉన్నారు. వీళ్లంతా అద్భుతంగా ఆడుతున్నారు. అయితే కొత్తగా తీసుకున్న ఆటగాళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడమే సంతోషించాల్సిన విషయం. స్టీవ్ స్మిత్‌ను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసి ఉంటే.. నేను అంతగా సంతోషించేవాడిని కాదు' అని అన్నాడు.

వేలంలో 8 మందిని తీసుకున్న కేకేఆర్:
గురువారం జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కరుణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అతడితో పాటు షకీబ్ అల్ హసన్ (రూ.3.2 కోట్లు), హర్భజన్ సింగ్ (రూ.2 కోట్లు), బెన్ కటింగ్ (రూ.75 లక్షలు), పవన్ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షలు), షెల్డన్ జాక్సన్ (రూ.20 లక్షలు), వైభవ్ అరోరా (రూ.20 లక్షలు)ను దక్కించుకుంది.
IPL 2021 Auction: అర్జున్.. క్రికెట్ నీ రక్తంలోనే ఉంది! తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉండు: సారా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications