
క్రికెట్ నీ రక్తంలోనే ఉంది
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తున్న ఫొటోను పంచుకొని సారా టెండూల్కర్ సంతోషం వ్యక్తం చేశారు. 'నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్ అనేది తన రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు' అని సారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కనీస ధరకే
అర్జున్ టెండ్యూలర్ ఇటీవల ముంబై సీనియర్స్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆడిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే 14వ సీజన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న అతడిని ముంబై కనీస ధరకే చేజిక్కించుకుంది. అర్జున్ లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ అన్న విషయం తెలిసిందే. అయితే సచిన్ కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన తీరు, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేశారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
వేలంలో తనను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌కు అర్జున్ టెండూల్కర్ ధన్యవాదాలు తెలిపాడు. 'చిన్నప్పటి నుంచి నాకు ముంబై ఇండియన్స్ జట్టంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లకు, జట్టు యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జట్టుతో కలిసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అర్జున్ పేర్కొన్నాడు. ముంబై జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్ సైతం అర్జున్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తాడని, అతనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కొనియాడాడు.

ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కౌల్టర్‌నైల్ (రూ.5 కోట్లు), ఆడమ్ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్ చావ్లా (రూ.2.4 కోట్లు), జేమ్స్ నీషమ్ (రూ.50 లక్షలు), యుధ్‌వీర్ (రూ.20 లక్షలు), జాన్సన్ (రూ.20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.20 లక్షలు).
IPL 2021 Auction: స్మిత్‌ను తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు.. ఢిల్లీకి అతని అవసరమే లేదు: గంభీర్


Click it and Unblock the Notifications












