For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే ఆ జట్టును ఓడించాలి: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమిండియా విజేతగా నిలవాలంటే పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టును ఓడిస్తేనే టీమిండియా విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచిందని గుర్తు చేశాడు.

వన్డే ప్రపంచకప్ ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌ను ఉద్దేశించిన గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని చెప్పాడు. 'ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టు. ముఖ్యంగా ప్రపంచ కప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో వాళ్లు ఎంతో అద్భుతంగా ఆడుతుంటారు.

Gautam Gambhir says If India

నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు​. అందుకే వరల్డ్‌ కప్‌ టోర్నీల్లోనే ఓడిస్తేనే టీమిండియా కప్పు కొడుతుంది. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ల్లో ఆస్ట్రేలియాను మేం ఓడించాం. ప్రపంచకప్ గెలిచాం'అని గంభీర్ గుర్తు చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్ల‌కు తోడుగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.

Story first published: Friday, September 22, 2023, 23:14 [IST]
Other articles published on Sep 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+