
కార్తీక్ సూపర్ ఫామ్‌లో..
'దినేశ్ కార్తీక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండో టీ20లో అతను ఆడిన ఇన్నింగ్స్ కూడా వెలకట్టలేనిది. ఆర్‌సీబీ తరుపున గత రెండు మూడు నెలల్లో అద్భుతంగా రాణించాడు. అయితే దినేశ్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్తీక్ ఉన్న ఫామ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అతన్ని టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి పంపడమే కరెక్ట్. అయితే దినేశ్ కార్తీక్‌ను టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సెలక్ట్ చేస్తారా? అంటే చెప్పడం కష్టం.

నేను ఎంపిక చేయను..
కార్తీక్ ఆఖర్లో వచ్చి ఓ రెండు మూడు ఓవర్లు ఆడి మెరుపులు మెరిపించి వెళ్తానంటే కష్టమే. ఎందుకంటే టీమిండియా టాప్ 7లో బ్యాటింగ్ చేస్తూ, మ్యాచ్‌ను ఫినిష్ చేయగల ఆల్‌రౌండర్ కోసం వెతుకుతోంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే వ్యక్తి బౌలింగ్ కూడా చేయగలగాలి. అప్పుడు టీమ్ సమతుల్యంగా ఉంటుంది. అక్షర్ పటేల్ కూడా షాట్స్ ఆడగలడు. కానీ కార్తీక్ స్టైల్ వేరు. అయితే టీ20 వరల్డ్ కప్‌ను మాత్రం నేను దినేశ్ కార్తీక్‌ను సెలక్ట్ చేయను...

కార్తీక్‌కు చోటు కష్టమే..
ఎందుకంటే టీమిండియాకు ఇప్పుడు రిషభ్ పంత్, దీపక్ హుడా వంటి మ్యాచ్ విన్నర్లు కావాలి. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్... వంటి ప్లేయర్లు ఉన్న టీమ్‌లో దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కాలంటే చాలా కష్టమే. టీమ్‌లో ఆడని దానికి టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయడం దేనికి? ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి డగౌట్‌లో కూర్చోబెట్టడానికా? ' అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 55 సగటుతో 183.33 స్ట్రైయిక్ రేటుతో దినేశ్ కార్తీక్ 330 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
