Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డీఆర్‌ఎస్‌ల వల్లే స్పిన్‌ను ఎదుర్కోలేకపోతున్నారు: గౌతమ్ గంభీర్

 Gautam Gambhir says I wont appreciate Test matches finishing in 2.5 days

న్యూఢిల్లీ: డీఆర్‌ఎస్ టెక్నాలజీ కారణంగానే ఈ తరం ఆటగాళ్లు టర్నింగ్ ట్రాక్స్‌పై ఆడలేకపోతున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. డీఆర్‌ఎస్‌ల వల్ల టెక్నిక్ మార్చుకుంటూ స్పిన్‌ను ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఇక టెస్ట్ మ్యాచ్‌లు రెండున్నర రోజుల్లో ముగియడం సరైంది కాదన్నాడు. టెస్ట్ మ్యాచ్ అంటే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్‌లా ఉండాలని చెప్పాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

 టర్నింగ్ ట్రాక్స్ మీద..

టర్నింగ్ ట్రాక్స్ మీద..

'టర్నింగ్‌ ట్రాక్స్‌ మీద ఆటడం చాలా కష్టమని నాకూ తెలుసు. కానీ, కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టులు ముగియడం ఏ మాత్రం సరైందికాదు. ఎప్పుడైనా సరే మ్యాచ్‌లు పోటాపోటీగా జరగాలి. ఇటీవల ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లా ఉండాలి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో కివీస్‌ విజయం సాధించింది. అలా కాకపోయినా.. కనీసం నాలుగు లేదా ఐదో రోజు వరకైనా మ్యాచ్‌ సాగాలి. అంతేకానీ, కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టు పూర్తి కావడం మాత్రం మంచిది కాదు.

డీఆర్‌ఎస్‌తో..

డీఆర్‌ఎస్‌తో..

గతతరం ఆటగాళ్లతో పోలిస్తే ఇప్పటితరం ప్లేయర్లు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేకపోతున్నారు. టెక్నాలజీ కారణంగా బ్యాటర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చక్కగా స్పిన్‌ బౌలింగ్‌ను ఆడగలరు. విరాట్ కోహ్లీ, పుజారాకు వందకుపైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడితేనే అలాంటి ఘనతను అందుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు డీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో డీఆర్‌ఎస్‌ లేకుండా, ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చినా ఎల్బీ కాకుండా బ్యాటర్లు తప్పించుకునేవారు. కానీ, ఇప్పుడు టెక్నిక్‌ను మార్చుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే త్వరగా ఆటగాడు పెవిలియన్‌కు చేరతాడు. డీఆర్‌ఎస్ గురించి మాత్రం అభిమానులు ఎక్కువగా మాట్లాడరు.'అని గౌతమ్ గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

నాలుగో టెస్ట్ అయినా..

నాలుగో టెస్ట్ అయినా..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో మూడు టెస్ట్‌లు రెండున్నర రోజుల్లోనే ముగిసాయి. పూర్తి స్పిన్‌కు అనుకూలించే వికెట్లను తయారు చేయడంతో బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ అదే స్పిన్ ఉచ్చులో పడి మూడో టెస్ట్‌లో ఓటమిపాలైంది. గురువారం నుంచి అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది. దాంతో అహ్మదాబాద్ వేదికగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, March 8, 2023, 20:55 [IST]
Other articles published on Mar 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+