Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: అదో చెత్త కోచింగ్.. పుల్ షాట్‌కు ఔటైతే పక్కన పెట్టేవారు!

Gautam Gambhir: క్రికెట్‌లో తాను ఆడే రోజుల్లో పుల్ షాట్, హుక్ షాట్స్‌కు ఔటైతే జట్టు నుంచి తప్పించేవారని టీమిండియా మాజీ ఓపెనర్, బీజీపే ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపాడు. అప్పటి కోచిం చాలా భిన్నంగా ఉండేదని, టెస్ట్ బుక్ షాట్స్ మాత్రమే ఆడాలని ఆటగాళ్లపై ఒత్తిడి చేసేవారని గుర్తు చేసుకున్నాడు. అదో చెత్త కోచింగ్ అని మండిపడ్డాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్.. ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ పర్యటనలో పుల్ షాట్‌కు ఔటయ్యానని తనను జట్టులో నుంచి తప్పించారని తెలిపాడు.

Gautam Gambhir says I was dropped from Team India for getting dismissed on pull-shot in Pakistan

'బ్యాటర్ కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ షాట్స్ ఆడుతూ ఔటైతే కోచ్‌లు ఏమనేవారు కాదు. కానీ పుల్, హుక్ షాట్స్ ఆడబోయి వెనుదిరిగితే మాత్రం జట్టు నుంచి తప్పించేవారు. పాకిస్థాన్ పర్యటనలో మూడు సార్లు పుల్ షాట్ ఆడబోయి ఔటయ్యానని నన్ను జట్టు నుంచి తప్పించారు. అప్పుడు టీమ్‌మేనేజ్‌‌మెంట్‌ను నేను నిలదీసాను. కవర్ డ్రైవ్ ఆడుతూ ఔటయ్యుంటే పక్కనపెట్టేవారా? అని అడిగాను.

ఓ బ్యాటర్‌ను ప్రత్యేకంగా ఓ షాట్ ఆడవద్దని ఆదేశిస్తే ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. క్రికెట్‌‌లో ఈ తరహా కోచింగ్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆటగాడి బ్యాటింగ్‌ను మెరుగుపరచడమే కోచ్ బాధ్యత. అంతేకానీ బ్యాటర్ ఆటను నియంత్రించడం కాదు.'అని గంభీర్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

టీ20లు రాజ్యమేలుతున్న క్రికెట్‌లో టెస్ట్ బుక్ షాట్స్ కంటే వినూత్న షాట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వీప్, రివర్స్ స్వీ, స్విచ్ హిట్ షాట్లు బాగా ప్రాచూర్యం పొందారు. ఒకప్పుడు ఈ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించినా.. కోచ్‌లు బ్యాటర్లకు పనిష్ మెంట్ ఇచ్చేవారు.

Story first published: Thursday, November 16, 2023, 21:15 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+