కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైనోడు.. గౌతం గంభీర్ ఆసక్తికర కామెంట్స్!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. ఫస్ట్ టైమ్ అతని గురించి సానుకూలంగా మాట్లాడాడు. టీమిండియా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైనోడని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా వన్డే, టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడని ప్రశంసించాడు. తానేప్పుడు ఈ రెండు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ సారథ్యాన్ని విమర్శించలేదని, కానీ టీ20ల్లో కెప్టెన్‌గా అతని వైఖరిని మాత్రం తప్పుబట్టానని తెలిపాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో తాత్కలిక సారథిగా అజింక్యా రహానే అదరగొట్టడంతో అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన గంభీర్.. టెస్ట్‌ల్లో విరాట్ సారథ్యానికి డోకా లేదని, అతని నేతృత్వంలో భారత్ మరిన్ని విజయాలందుకుంటుందన్నాడు.

విరాటే సరైనోడు..
'నేనెప్పుడూ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీనే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో అతని సారథ్యాన్ని తప్పుబట్టలేదు. ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ సారథ్యంలోని భారత్ జట్టు అద్భుతంగా రాణించింది. ముందు ముందు కూడా అతని సారథ్యంలో భారత జట్టు ఇదే జోరును కొనసాగిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. భారత జట్టు ఏ ఒక్కరి ఇద్దరి మీదనో ఆధారపడదు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ కూడా పలు మార్లు చెప్పాడు. టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైనోడు. ఈ ఫార్మాట్‌లో అతను విశేషంగా రాణించాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కీలకం..
ఇక ఇంగ్లండ్‌తో జరిగే అప్‌కమింగ్ సిరీస్‌లో కోహ్లీ కీలకం అవుతాడని గంభీర్ పేర్కొన్నాడు. పెటర్నిటీ లీవ్ తర్వాత జట్టులోకి వచ్చిన అతను చాలా ఫ్రెష్‌గా ఉన్నాడన్నాడు. 'అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఎందుకంటే అతను ఫ్రెష్‌గా జట్టులోకి వచ్చాడు. కూతురు పుట్టిన సంతోషంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ప్రస్తుతం అతను తన జీవితంలో మంచి దశలో ఉన్నాడు. ఎందుకంటే జీవితంలో తండ్రైన క్షణానికి మించింది మరేది లేదు. ఓ నాయకుడికి కావాల్సింది కూడా ఆ ఉత్సాహమే.

విరాట్‌కు తెలుసు..
ఏ క్రికెటర్‌కు అయినా సెంచరీల కన్నా జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేయడం ముఖ్యం. ఆస్ట్రేలియాలో బాగా బ్యాటింగ్ చేయలేదనేది విరాట్ కోహ్లీకి పెద్ద విషయమే కాదు. అతను ఇంగ్లండ్ సిరీస్ కోసం ఆతృతగా ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసు.'అని గంభీర్ ముగించాడు. ఆస్ట్రేలియా గడ్డపై రహానే సారథ్యంలో చారిత్రక టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా ఆ ఉత్సాహంతోనే ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం సన్నదమవుతోంది. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications