Virat Kohli సెంచరీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. ప్రశంసిస్తూనే సూటి పోటీ మాటలు.!

న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 1,025 రోజుల తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అది కూడా తన ఆటకు ఏమాత్రం సూటవ్వని ఫార్మాట్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న టీ20ల్లో శతకం బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌కు ఇది మొదటి సెంచరీ కాగా మూడు ఫార్మాట్లలో కలిపి 71వ శతకం. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఆసియా కప్ ముందు వరకు విరాట్ ఫామ్‌కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు.

నిజమైన హీరోలు..
దాదాపు నెల రోజులపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకొని మరీ బరిలోకి దిగాడు. ఫామ్ అందుకొన్న కోహ్లీ ఆసియా కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల(5 మ్యాచుల్లో 276) వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. నిజమైన హీరోలు తమ సత్తాతోనే విమర్శలకు సమాధానాలు చెబుతారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర విరాట్‌ను కొనియాడుతూ ట్వీట్ చేయగా.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ తో పాటు సురేశ్ రైనా, హసన్ అలీ, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు కోహ్లీకి అభినందనలు తెలిపారు.

సెంచరీని వదలని గంభీర్..
ఇక అవకాశం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఓవైపు విరాట్‌ను కొనియాడుతూనే మరోవైపు సూటి పోటీ మాటలతో అతన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లీ గురించి సాధారణంగా గౌతమ్ గంభీర్ పాజిటివ్‌గా మాట్లాడడు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఐపీఎల్‌లో ఈ ఇద్దరి మధ్య ఓసారి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కలిసి ఆడినా అంత సఖ్యతతో కనిపించలేదు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో టైటిల్ గెలవలేదని ఎద్దేవా చేసిన వారిలో గౌతమ్ గంభీర్ ఫస్ట్. అలానే కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు తీవ్రంగా విమర్శించిన వారిలో కూడా గంభీర్ ఉన్నాడు. తాజా సెంచరీపై మాట్లాడుతూ.. విరాట్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా ఉండటం వల్లే సెంచరీ సాధించాడని తెలిపాడు.

విరాట్ కోహ్లీ కాబట్టే...
'విరాట్ కోహ్లీ సెంచరీ సాధించక మూడేళ్లు అయ్యింది. ఇది చాలా లాంగ్ టైమ్. ఇక్కడ నేను అతన్ని విమర్శించడం లేదు. కానీ.. ఈ మూడేళ్లు అతనికి చాలా మద్దతు లభించింది. దానికి కారణం గతంలో అతను పెద్ద ఎత్తున పరుగులు చేయడమే. ఒకవేళ విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరైనా యువ ప్లేయర్ ఉండి.. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతే జట్టులో కొనసాగేవాడని నేను అనుకోవడం లేదు. కానీ.. సరైన సమయంలో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. ఓపెన్‌గా చెప్పాలంటే 1020 రోజులు సెంచరీ చేయలేకపోతే ఏ క్రికెటర్ కూడా ఇన్ని రోజులు జట్టులో కొనసాగేవాడు కాదు.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

సెంచరీలు చేయకుంటేనేం..
అయితే గంభీర్ వ్యాఖ్యలపై విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయకున్నా మరీ చెత్తగా ఆడలేదని గుర్తు చేస్తున్నారు. ఆడపా దడపా హాఫ్ సెంచరీలతో పాటు జట్టుకు కావాల్సిన పరుగులు చేశాడని కామెంట్ చేస్తున్నారు. సెంచరీ చేయకున్నా.. జట్టులోని ఇతర ఆటగాళ్లతో సమంగా పరుగులు చేశాడని గణంకాలతో సహా ట్వీట్ చేస్తూ గంభీర్‌పై విరుచుకుపడుతున్నారు. సెంచరీ చేయకుంటే ఫామ్‌లో లేడని మాట్లాడుకునేలా కోహ్లీ ట్రెండ్ సెట్ చేశాడని కొనియాడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications