భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గౌతమ్ గంభీర్
భయం అనేది తన డిక్షనరీలోనే లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోనే సామర్థ్యం తమకు ఉందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ.. టీమిండియా ప్రదర్శన సంతృప్తినిచ్చిందని గంభీర్ అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో, ప్రాక్టీస్‌కు ఏ మాత్రం సమయం లేకున్నా.. సిరీస్ గెలిచామని తెలిపాడు.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న విరామం లేకుండా గత 12 సిరీస్‌లు ఆడుతున్నామని చెప్పాడు.
ఈ క్రెడిట్ వారిదే..
'మా ఆటగాళ్లందరూ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ప్రాక్టీస్‌కు ఒక్క రోజే దొరికింది. అందులోనూ న్యూజిలాండ్‌ను తమ సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలే. మేం అక్టోబర్ 20న వచ్చాం. 21న నెట్స్‌లో సాధన చేశాం. 22నే బరిలోకి దిగాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సిరీస్ గెలవడం ఆషామాషీ కాదు.

ఈ క్రెడిట్ పూర్తిగా మా ఆటగాళ్లదే. బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడటం వల్ల ప్రణాళికలు వేసుకునేందుకు సమయమే లేదు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. అందుబాటులో ఉన్న వనరులతోనే సానుకూల ఫలితాలు రాబట్టాడు. అయితే టెస్ట్ సిరీస్‌కు మాత్రం మంచి సన్నదతోనే బరిలోకి దిగుతాం.
జట్టుకే ప్రాధాన్యమిస్తా..
ఏ విషయంలోనూ నేను భయపడలేదు. ఆ పదమే నా డిక్షనరీలోనే లేదు. మేమంతా ప్రొఫెషనల్స్, సాయశక్తులా ప్రయత్నించడం, దేశానికి విజయాలు అందించడమే మా పని. ఆకర్షణీయమైన నిర్ణయాల కంటే జట్టుకు ఉపయోగపడే వాటికే నేను ప్రాధాన్యమిస్తా. ఆటగాళ్లలో అభద్రతాభావం రాకూడదంటే.. వారికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. నేను అదే చేస్తున్నా.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఆఖరి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(32 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్స్‌లతో 61), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆడమ్ మిల్నే(4/19) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.
అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. టీమ్ సీఫెర్ట్(50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 93), గ్లేన్ ఫిలిప్స్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
