
మోర్గాన్ కెప్టెనా?
ఈ నలుగురిలో కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీనే అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన గంభీర్.. నలుగురు కెప్టెన్ల పనీతురును విశ్లేషించాడు. 'మోర్గాన్ కెప్టెన్‌గా చేసిందేం లేదు. వీడియో అనలిస్టే ఆ జట్టును వెనకుండి నడిపించాడు. మోర్గాన్ కేవలం అతన్ని ఫాలో అయ్యాడు. మైదానంలో అతను సారథ్యం వహించినట్లు నాకు ఎక్కడా కనిపించలేదు. బహుషా మైదానం బయట కెప్టెన్‌గా ఉన్నాడేమో.

కోహ్లీ కెప్టెన్సీ సూపర్..
ఇక విరాట్ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నిజాయితీ చెప్పాలంటే ఇంతకుముందు ఎప్పుడూ కోహ్లీ కెప్టెన్సీని ఆస్వాదించలేదు. కానీ ఈ సారి మాత్రం అతని అద్భుత సారథ్యానికి ఫిదా అయ్యాను. బహుషా కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ కావడంతో కోహ్లీ రిలాక్స్‌గా ఉన్నట్లున్నాడు. దాంతోనే అత్యుత్తమ ప్రదర్శన చేయగలగుతున్నాడనుకుంటా. అంతేకాకుండా ఆటను కూడా ఆస్వాదిస్తున్నట్లున్నాడు. ఈసారి ఆర్‌సీబీకి మంచి బౌలర్లు కూడా ఉన్నారు. అది కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ బెస్ట్..
కెప్టెన్సీ పరంగా అత్యుత్తమ ప్రదర్శన చేసింది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్‌కు సీనియర్ ఆటగాళ్ల అనుభవం సాయం చేస్తుందన్నాడు. 'కేవలం కెప్టెన్సీ విషయం గురించి మాట్లాడుకుంటే మహేంద్ర సింగ్ ధోనీ బెస్ట్. అతను ఒత్తిడిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలడు. ఇక రిషభ్ పంత్‌కు సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. స్టీవ్ స్మిత్ తుది జట్టులో ఉంటే పంత్‌కు అతని సాయం లభిస్తుంది. అలాగే కెప్టెన్‌గా అనుభవం ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలుస్తాడు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ధోనీనే నెంబర్ వన్.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీనే ఫేవరేట్..
ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా నేడు(ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఢిల్లీ జట్టే హాట్ ఫేవరేట్ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చెన్నై కన్నా ఢిల్లీనే పటిష్టంగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
ఆవేశ్ ఖాన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్ పేసర్లతో పాటు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ప్రతిభావంతమైన బౌలర్లున్నారని, వీరు చెన్నైకి కళ్లెం వేయడం ఖాయమని చెప్పాడు. ఇక బ్యాటింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగా ఉందని, ఆరుగురు పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ అందుబాటులో ఉన్నారని చెప్పుకొచ్చాడు. మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వస్తే టీమ్ బలం రెట్టింపు అవుతుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












