For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautam Gambhir: ఆ మాటలు అందరికి వినిపించాలి! మజా వస్తుంది!

Gautam Gambhir says Chats on stump mics are insightful and entertaining

న్యూఢిల్లీ: మైదానంలోని స్టంప్ మైక్స్‌లో రికార్డయ్యే మాటలను అందరికి వినిపించాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆ మాటలు ఆసక్తికరంగా ఉంటాయని, మజా లభిస్తుందని చెప్పుకొచ్చాడు. తనకే అధికారం ఉంటే గనుక ఆ మాటలు అందరికి వినిపించేలా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో ఈ బీజేపీ ఎంపీ ఆసక్తికర విషయాలు రాసుకొచ్చాడు. బ్రాడ్‌కాస్టర్ ప్రతినిధులుగా తమకు స్టంప్‌ మైక్రోఫోన్‌ ఆడియో వినే అవకాశముంటుందని చెప్పాడు. స్టంప్స్ మైక్‌లోని ఆటగాళ్ల మాటలు వింటే.. వారి ప్రణాళికలు, ఆలోచనలు అర్తమవుతాయన్నాడు.

ముంబై, రాజస్థాన్ మ్యాచ్‌లో..

ముంబై, రాజస్థాన్ మ్యాచ్‌లో..

'స్టంప్స్ మైక్స్‌లోని కొన్ని సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల ముంబై ఇండియన్స్, రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ బంతికి ఎలా మెరుపు తెప్పించాలన్నదానిపై ఓ భారత యువ బౌలర్‌ మాటలు మాకు వినిపించాయి. అతని సహచరులు మాత్రం.. మెరుపు గురించి ఆలోచించకుండా మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్​తో బౌలింగ్‌ చేయమని చెప్పారు. చిన్నప్పుడు తాను జాన్‌ మెకన్రో ఎప్పుడు అరుస్తాడా, చైర్‌ అంపైర్‌పై ఎప్పుడు అసహనాన్ని ప్రదర్శిస్తాడా? అని ఆసక్తిగా ఎదురుచూసేవాణ్ని. చైర్‌ అంపైర్‌ మైక్రోఫోన్​ ద్వారా అతని మాటలు వినిపించేవి. క్రికెట్‌లో కూడా ఇదే ఆసక్తి ఉంటుందనేది నా అభిప్రాయం." అని గంభీర్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.

బేబీ సిట్టింగ్‌తో పంత్ ఫేమస్..

బేబీ సిట్టింగ్‌తో పంత్ ఫేమస్..

'స్టంప్‌ మైక్రోఫోన్లను ఆఫ్‌ చేయాలనే వాదన కూడా ఉంది. వాటి వల్ల ఆటగాళ్లు స్వేచ్ఛగా ఉండలేరనదే కొందరి అభిప్రాయం. కానీ నాకైతే అలా అనిపించట్లేదు. ఈతరం క్రికెటర్లు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎక్కువ మంది క్రికెటర్లు ఇటీవల తమ పోస్టుల ద్వారా లేదా స్టంప్‌ మైక్రోఫోన్ల ద్వారా అభిమానుల దృష్టిలో పడడాన్ని ఆస్వాదిస్తున్నారు. టిమ్ పైన్‌ 'బేబీ సిట్టింగ్' వ్యాఖ్యలు.. రిషభ్‌ పంత్‌ పేరు అందరి నోళ్లలో నానేలా చేసాయి. నాకే అధికారం ఉంటే ఆ మాటలు అందరికి వినిపించేలా చేసేవాడిని'అని గంభీర్ పేర్కొన్నాడు.

డివిలియర్స్‌ను అక్కడా? ఆడించేది?

డివిలియర్స్‌ను అక్కడా? ఆడించేది?

ఏబీ డివిలియర్స్‌ను ఆర్‌సీబీ ఆరో స్థానంలో ఆడించడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌తో మాట్లాడిన గంభీర్.. అతన్ని ఓపెనర్‌గా లేదా ఫస్ట్‌డౌన్‌లో ఆడించాలన్నాడు. 'ఆర్‌సీబీ జట్టు డివిలియర్స్‌ను ఎప్పటికీ ఓపెనర్‌గా లేదా నెంబర్‌ 3 బ్యాట్స్‌మన్‌గా ఆడించాలి. నా దృష్టిలో అతను ఆరోస్థానంలో ఆడటంలో అర్థమేలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగడమే నేను ఇష్టపడతాను. అతనో అద్భుతమైన ఆటగాడు. అందుకే నేను డివిలియర్స్‌ ఆటను ఎక్కువగా చూడాలనుకుంటున్నా. అలాగే ఆ జట్టు మూడో స్థానంలో డానియెల్‌ క్రిస్టియన్‌ను ఆడించొద్దు. అతడికి బదులు శ్రీలంక ఆటగాళ్లు దుష్మంత చమీరా, వానిందు హసరంగలను తీసుకోవాలి" గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 8, 2021, 19:06 [IST]
Other articles published on Oct 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+