Gautam Gambhir: ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా.. అతని బౌలింగ్ ఆడాలంటే వణికిపోతారు!

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా.. షమీ బౌలింగ్ ఆడాలంటే వణికిపోతారని కొనియాడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ బ్రేక్ త్రూతో భారత బౌలర్లు చెలరేగి సౌతాఫ్రికాను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఇక ఇన్నింగ్స్ బ్రేక్‌లో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్.. షమీ బౌలింగ్‌ను కొనియాడాడు.

ఏ గొప్ప బ్యాట్స్‌మన్‌ను అడిగినా..
'ఈ సిరీస్‌లో మహమ్మద్ షమీ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. మెరుపు వేగంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కచ్చితత్వంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ బ్యాట్స్‌మన్‌కు సవాల్ విసురుతున్నాడు. ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ను అయినా అడగండి. అతను ఎంత ప్రమాదకర బౌలరో చెబుతారు. ఎవరూ అతని బౌలింగ్‌ను ఎదుర్కొనే సాహసం చేయరు. అతను వేసే బంతులు వికెట్లకు చాలా సమీపంలోంచి వెళ్తుంటాయి. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెట్టగలడు. అందుకే, ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బౌలర్లలో షమీ ఒకడిగా గుర్తింపు పొందాడు' అని గౌతమ్ గంభీర్ కొనియాడాడు.

5 వికెట్ల ఘనతతో..
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా సాధించిన తొలి టెస్ట్ విజయంలో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఓటమిపాలైన రెండో టెస్టులోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసాడు.

సెంచరీ దిశగా రిషభ్ పంత్..
ఇక కీలక మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. 57/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 59 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్(87 బ్యాటింగ్) సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. మరో ఎండ్‌లో టెయిలెండర్స్ ఉన్నారు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడ్డ జట్టును పంత్- విరాట్ కోహ్లీ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. ఇక విరాట్‌ను ఎంగిడి ఔట్ చేయడంతో భారత్ వరుసగా అశ్విన్, శార్దూల్, ఉమేశ్ యాదవ్ వరుసగా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 193 పరుగుల ఆధిక్యంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications