
టీమిండియాకు ప్యాకేజ్‌లా మారతాడు:
స్టార్ స్పోర్ట్స్ షోలో గౌతమ్ గంభీర్ తాజాగా రిషబ్ పంత్ గురించి మాట్లాడారు. 'రిషబ్ పంత్ ఎంతో విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. చెన్నైలోని కఠిన పరిస్థితిలో కూడా గొప్ప ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో నమ్మకంతో చేసే ప్రదర్శన ఫలితం వికెట్ కీపింగ్‌లోనూ ప్రతిబింబిస్తుంది. చెపాక్ వికెట్‌పై రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌కు వికెట్ కీపింగ్ చేయడం కష్టమే. అయినా పంత్ బాగా ఆకట్టుకున్నాడు. అతడు కీపింగ్‌లో ఎంతో మెరుగవుతున్నాడు. గతంలో కంటే ఎంతో మెరుగయ్యాడు. ఇలానే పరుగులు సాధిస్తూ.. వికెట్ కీపింగ్‌లో మరింత మెరుగైతే టీమిండియాకు గొప్ప ప్యాకేజ్‌లా మారతాడు' అని గౌతీ అన్నారు.

భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తి అవుతాడు:
'ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రిషబ్ పంత్‌లా మ్యాచ్ ఫలితాన్నే మార్చే సామర్థ్యం ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎక్కువ మందికి లేదు. టెస్టుల్లో పంత్ తన ప్రదర్శన ఇలానే కొనసాగిస్తే.. అతడు భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి అవుతాడు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జొస్ బట్లర్‌కు కూడా సామర్థ్యం ఉంది. అతడికి బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో మంచి నైపుణ్యాలు ఉన్నాయి' అని గౌతమ్ గంభీర్ చెప్పారు. ఆదివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్‌పై భారత్ 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులు చేయగా.. రూట్ సేన 134 పరుగులకే ఆలౌటైంది.

కీపింగ్ విన్యాసాలు:
రెండో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కీపింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనక మెరుపు వేగంతో కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు. భారత్‌లో తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించగా.. బంతి అతని గ్లోవ్‌కు తగిలింది. బంతి తన ఎడమవైపు వెళ్తుండగా పంత్ సూపర్ మ్యాన్ తరహాలో డైవ్ చేసి అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌లోనే హైలెట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ మెరిశాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో కూడా:
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా రిషబ్ పంత్ రాణించిన విషయం తెలిసిందే. సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో 407 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. రిషబ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో విజయం సాధించేలా కనిపించింది. అయితే జట్టు స్కోరు 250 వద్ద పంత్ ఔటవగా.. అనంతరం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్; 128 బంతుల్లో 7×4), హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (23 నాటౌట్; 161 బంతుల్లో 4×4) మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. ఇక గబ్బా టెస్టులో పంత్ (89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.
Australian Open 2021: థీమ్‌కు షాక్.. జొకోవిచ్ 300! మార్గరెట్ రికార్డుపై కన్నేసిన సెరెనా!


Click it and Unblock the Notifications












