Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: 20 మ్యాచ్‌ల తర్వాత విజయం.. ఎగిరి గంతేసిన గంభీర్!

సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. వరుసగా 20 వన్డేల తర్వాత టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. వరుసగా 20 వన్డేల తర్వాత టీమిండియా టాస్ గెలవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. ' హమ్మయ్యా.. టాస్ గెలిచాం'అని రాహుల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

రాహుల్‌కు మద్దతు తెలిపారు. టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది. ఆ తర్వాత 20 వన్డేలు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లోనూ టాస్ గెలవలేదు. ఎట్టకేలకు వైజాగ్ వేదికగా జరుగుతున్న తాజా వన్డేతో టాస్ ఓటములకు చెక్ పెట్టింది. టాస్ గెలవగానే రాహుల్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎగిరి గంతేసారు. మ్యాచ్ గెలిచిన తరహాలో సంబరాలు చేసుకున్నారు.

Gautam Gambhir s Reaction Goes Viral as India Finally Win an ODI Toss After 20 Matches

గత మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం టీమిండియాకు నష్టం చేసింది. ముఖ్యంగా డ్యూ ఫ్యాక్టర్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో టాస్ గెలవడం కీలకంగా మారింది. ఈ క్రమంలోనే టాస్ గెలవగానే భారత ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కేఎల్ రాహుల్‌కు అభినందనలు తెలియజేశారు. ఎట్టకేలకు సాధించాం అంటూ సైగలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

టాస్ గెలిచిన రాహుల్.. మరో ఆలోచన చేయకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని, బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తున్నామని చెప్పాడు.

Story first published: Saturday, December 6, 2025, 14:48 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+