Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. నవ్వు ఆపుకోలేకపోయిన గంభీర్!(వీడియో)

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు టాస్ గెలిచాడు. టెస్ట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ టాస్ గెలవడం ఇదే తొలిసారి. వరుసగా గత 6 మ్యాచ్‌ల్లో గిల్ టాస్ ఓడాడు. ఇంగ్లండ్ పర్యటనతో కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన గిల్.. అక్కడ ఐదు మ్యాచ్‌లకు ఐదింటిలోనూ టాస్ ఓడిపోయాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ టాస్ గెలవలేకపోయాడు.

న్యూఢిల్లీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి.. టాస్ విషయంలో పరాజయాల పరంపరకు బ్రేక్ వేసాడు. 6 మ్యాచ్‌ల తర్వాత గిల్ టాస్ గెలవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఎట్టకేలకు మనోడు టాస్ గెలిచాడని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు.

Gautam Gambhir s Priceless Reaction as Shubman Gill Wins the Toss in His First Test as Captain
Photo Credit: Screengrab from JioHotstar

ఇరు జట్లు టాస్‌‌కు సిద్దం కాగా.. వారి వెనుకాలే టీమిండియా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి నిల్చున్న గంభీర్ ఆసక్తిగా గమనించాడు. గిల్ టాస్ గెలిచిన వెంటనే నవ్వుతూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గత 6 మ్యాచ్‌ల్లో గిల్ టాస్ ఓడినా.. టీమిండియా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న భారత్.. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.

రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన గిల్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. గత మ్యాచ్ ప్రదర్శననే పునరావృతం చేయాలని భావిస్తున్నామని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించామని తెలిపాడు.


తుది జట్లు:

వెస్టిండీస్:

జాన్ క్యాంప్‌బెల్, టేగనరైన్ చందర్‌పాల్, అలిక్ అతానాజ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.

ఇండియా:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Story first published: Friday, October 10, 2025, 10:44 [IST]
Other articles published on Oct 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+