IPL 2022: లక్నో విజయం.. గౌతమ్ గంభీర్ భావోద్వేగం.. గట్టిగా అరుస్తూ సంబరాలు (వీడియో)!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్‌లోకి లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా అడుగుపెట్టడంతో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో గంభీర్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఓటమి అంచులకు వెళ్లిన జట్టు థ్రిల్లింగ్ విజయాన్నందుకోవడం గంభీర్‌కు కావాల్సినంత మజానిచ్చింది. దాంతో గంభీర్ గట్టిగా అరుస్తూ గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం గంభీర్ రియాక్షన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
లాస్ట్ బాల్‌కు కళ్లుమూసుకున్న గంభీర్..
చివరి ఓవర్‌లో కోల్‌కతా టీమ్ విజయానికి 21 పరుగులు అవసరమవగా.. రింకు సింగ్ వరుసగా 4, 6, 6, 2 కొట్టేశాడు. దాంతో.. గెలుపు సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులతో తేలికగా మారిపోయింది. దాంతో కోల్‌కతా విజయం ఖాయమనుకున్నారు. చేతుల్లో ఉన్న మ్యాచ్ చేజారుతుండటంతో డగౌట్‌లో ఉన్న గౌతమ్ గంభీర్ చాలా అసహనానికి గురయ్యాడు. ఆఖరి ఓవర్‌లో స్టాయినిస్ వేసిన ప్రతి బంతికీ ముందు గంభీర్ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఐదో బంతికి రింకూ సింగ్ క్యాచ్ ఔటైనా గంభీర్ పెద్దగా స్పందించలేదు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజులోకి ఉమేశ్ యాదవ్ రాగా.. స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆఖరి బంతిని చూడకుండా గంభీర్ కళ్లు మూసుకున్నాడు.
అందుకే అంత ఏమోషల్..
వాస్తవానికి గౌతమ్ గంభీర్ ఇలా సంబరాలు చేసుకోవడం చాలా అరుదు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గంభీర్.. కనీసం నవ్వడం కూడా చాలా మంది అభిమానులు చూసుండరు. కానీ.. అలాంటి గంభీర్.. బుధవారం రాత్రి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. దానికి ప్రధాన కారణం.. లక్నో జట్టు వ్యవహారాలన్ని గంభీర్ దగ్గరుండి చూడటం. లక్నో సూపర్ జెయింట్స్‌కి ఇదే తొలి ఐపీఎల్ సీజన్‌కాగా.. ఆటగాళ్ల వేలం దగ్గర నుంచి అన్ని బాధ్యతలను గంభీరే పర్యవేక్షించాడు. ఆయూష్ బదోని వంటి యువ కెరటాన్ని వెలుగులోకి తెచ్చాడు. అంతేకాకుండా అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకునేలా కనిపించిన లక్నో సూపర్ జెయింట్స్.. కోల్‌కతాతో మ్యాచ్‌కి ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దాంతో.. లక్నో టీమ్‌తో పాటు మేనేజ్‌మెంట్ కూడా ఒత్తిడిలో కనిపించింది.
రాహుల్‌ను హగ్ చేసుకుంటూ...
ఈ నేపథ్యంలో.. ప్లేఆఫ్స్‌కి చేరగానే అంతా ఊపిరి పీల్చుకుని.. గెలుపు సంబరాలు చేసుకున్నారు. విజయానంతరం కేఎల్ రాహుల్‌కు హగ్ ఇచ్చిన గంభీర్ ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? కోల్‌కతా జట్టుకి గతంలో కెప్టెన్‌గా ఉన్న గంభీర్.. ఆ జట్టును రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. తన మాజీ జట్టుపై విజయం సాధించడాన్ని గంభీర్ బాగా ఆస్వాదించాడు. ఇక లక్నో ఆటగాళ్లు సైతం టైటిల్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ మ్యాచ్ అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications