For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautham Gambhir: శ్రేయస్ అయ్యర్ కన్నా సూర్యకుమార్ యాదవ్ ప్రతిభావంతుడు

Gautam Gambhir Reveals Why Suryakumar Yadav Was Picked Ahead Of Shreyas Iyer For T20 WC
T20 WC: Shreyas Iyer కంటే బెటర్ గా Suryakumar లాప్‌, లేట్‌ కట్‌, ఎక్స్‌ ట్రా కవర్ షాట్‌లతో

న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్‌ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య అసాధారణమైన ఆటగాడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడాడు. టీ20 ఫార్మాట్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని మెళకువలు అతనిలో ఉన్నాయన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పోల్చి చూస్తే సూర్యకుమార్‌ ఎంతో ప్రతిభావంతుడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కగా.. శ్రేయస్ అయ్యర్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. అయితే అయ్యర్ ప్లేస్‌లో సూర్యకు అవకాశం దక్కింది. అయ్యర్ బదులు సూర్యను తీసుకోవడానికి గల కారణాన్ని గంభీర్ వివరించాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 'ఫాలో ద బ్లూ'షోలో మాట్లాడుతూ.. సూర్య అన్ని రకాల షాట్లు ఆడగలడని తెలిపాడు.

అసాధారణమైన బ్యాట్స్‌మన్..

అసాధారణమైన బ్యాట్స్‌మన్..

'సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తి భిన్నమైన ఆటగాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పోలిస్తే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అసాధారణమైన ఆటగాడు. టీ20 ఫార్మాట్‌లో మనకు ఇలాంటివారే కావాలి. బంతిని మైదానంలో నలువైపులా బాదే ఆటగాళ్లు మనకు కావాలి. టీ20 క్రికెట్‌ అంటేనే అది. సూర్యకుమార్‌.. లాప్‌ (కీపర్‌ వెనుక మీదుగా బాదడం), లేట్‌ కట్‌, ఎక్స్‌ ట్రా కవర్ షాట్‌లతోపాటు అన్ని రకాల షాట్లను ఆడగలడు. ముఖ్యంగా నాలుగో స్థానంలో. ఎందుకంటే కొన్నిసార్లు టీ 20 క్రికెట్‌లో బ్యాటింగ్ చేయడానికి నాలుగో స్థానం అత్యంత కఠినమైనది. బహుశా మొదటి మూడు స్థానాలు చాలా సులభమైనవి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు జట్టు అంతకుముందే రెండు వికెట్లు కోల్పోయి ఉండొచ్చు. అప్పుడు పరుగులు రాబట్టడం కోసం వేగంగా ఆడతారు' అని గంభీర్‌ అన్నాడు.

ధోనీ చేసేదేం లేదు..

ధోనీ చేసేదేం లేదు..

అంతకుముందు మెంటార్‌గా ధోనీని ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'ఇందులో ధోనీ పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జట్టుకు ప్రధాన కోచ్​, అసిస్టెంట్​ కోచ్​, బౌలింగ్​ కోచ్​ ఉన్నారు. కాబట్టి కోచ్​ రవిశాస్త్రి, కెప్టెన్​ విరాట్​ కోహ్లీలు కాకుండా.. కొత్తగా అతడికి ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20ల్లో టీమిండియా విజయవంతంగా కొనసాగుతోంది. కానీ, కష్టాల్లో లేదు. ఒకవేళ పొట్టి ఫార్మాట్​లో భారత్​ జట్టుకు నిలకడ లేకపోతే బయట నుంచి ఎవర్ని అయినా తీసుకోవచ్చు.

ఒత్తిడిని అధిగమించేందుకు..

ఒత్తిడిని అధిగమించేందుకు..

బహుశా.. కీలక మ్యాచ్​ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్​గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు. అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్​ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్​ మ్యాచ్​ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు.

 యువ ఆటగాళ్లకు...

యువ ఆటగాళ్లకు...

ముఖ్యంగా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లున్నారు. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తీ, సూర్యకుమార్ యాదవ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. వారితో ధోనీ తన అనుభవాన్ని కచ్చితంగా పంచుకుంటాడు. ఈ ఒక్క విషయంలో తప్పా ధోనీ వల్ల జట్టుకు ఒరిగేదేమి లేదు. స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, ఇతర సహాయ సిబ్బింది ఉండనే ఉన్నారు. " అని గంభీర్​ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 11, 2021, 10:21 [IST]
Other articles published on Sep 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+