Gautam Gambhir: మేం ఎవరినీ కాపీ కొట్టదల్చుకోలేదు!

న్యూఢిల్లీ: తాము ఎవరినీ కాపీ కొట్టదల్చుకోవడం లేదని, ఇంతకుముందెన్నడూ రూపొందించని విధంగా కొత్త జట్టును తీర్చిదిద్దుతామని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సంబంధించిన ప్రణాళికలను గౌతమ్ గంభీర్ పంచుకున్నాడు. టీమ్ సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జట్టును తయారు చేస్తామని, దానికి అనుగుణంగానే వేలంలో ఆటగాళ్లను కొనగోలు చేస్తామని చెప్పాడు. టీమ్ ప్రణాళికల గురించి ఓ యూట్యాబ్ చానెల్‌లో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ఇంతకుముందు ఎన్నడూ రూపొందించని విధంగా కొత్త జట్టును తీర్చిదిద్దడం గొప్ప అవకాశం. ఈ విషయంలో మేం ఎవరినీ కాపీ కొట్టదల్చుకోలేదు. మా ప్రణాళికలు మాకున్నాయి. మా ప్రత్యేకత మాకు ఉండాలి కూడా. ఇంతకుముందు సంజీవ్ గోయెంకా.. రైజింగ్ పుణె జట్టును సొంతం చేసుకున్నప్పుడు ఒక్క పరుగుతో టైటిల్ దూరమైంది. అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు ప్రయత్నించడమనేది గొప్ప చాలెంజ్. అయితే, ఒక్క సీజన్‌లోనే అంతా జరిగిపోతుందని నేను చెప్పలేను. అది సుదీర్ఘకాల ప్రక్రియ. ఈ ఒక్క ఏడాది కోసమే మేం జట్టును తయారుచేయాలనుకోవట్లేదు. భవిష్యత్‌పైనా మంచి ఆలోచనలు ఉన్నాయి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
యువ మణికట్టు స్పిన్నర్ రవిబిష్ణోయ్ కచ్చితంగా వికెట్లు తీసే బౌలర్ అని గంభీర్ ప్రశంసించాడు. 'అతనో యువ క్రికెటర్, ప్రతిభావంతుడు, వికెట్ టేకర్. కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడు. ఆటలో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయగల సమర్థుడు. ఇలా ఏ విధంగా చూసినా అతను మా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగేందుకు పూర్తి అర్హుడైన ఆటగాడు. దీంతో భవిష్యత్‌లో మేం అతడిని మరింత ఉన్నతమైన స్పిన్నర్‌గా తీర్చిదిద్దాలని చూస్తున్నాం. ఇప్పుడున్న లెగ్ స్పిన్నర్లలో అతడే చిన్నవాడు. అది మాత్రమే కాకుండా అతనే అత్యుత్తమైన బౌలర్ కూడా. ఈ నేపథ్యంలో రవి గురించి మా వద్ద స్పష్టమైన దీర్ఘకాల ప్రణాళికలు ఉన్నాయి' అని గంభీర్ తెలిపాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ప్రకటించగా.. రవి బిష్ణోయ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌లను వేలానికి ముందు ఎంచుకున్నాయి. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగావేలం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications