
గొప్పలు చెప్పుకోవద్దు..
'ఎవరైనా బాగా ఆడేటప్పుడు గొప్పలు చెప్పుకోరు. ఆ విజయాల గురించి ఇతరులు మాట్లాడుకుంటే ఫర్వాలేదు కానీ, నీ గురించి నువ్వే చెప్పుకుంటే బాగోదు. మేం 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు.. మాలో ఎవ్వరూ మేం అత్యుత్తమ జట్టు అనే వ్యాఖ్యలు చేయలేదు. అది దేశ ప్రజలకే వదిలేశాం. మనం విజయాలు సాధిస్తే అది ఇతరులు మాట్లాడుకునేలా ఉండాలి.
టీమిండియా ఆస్ట్రేలియాలో గడ్డపై విజయాలు సాధించడం గొప్ప విశేషం. అది ఏ మాత్రం తక్కువ కాదు. అలాగే ఇంగ్లండ్‌లోనూ రాణించింది. వాటి గురించి వేరేవాళ్లు మనల్ని కీర్తించాలి.

ద్రవిడ్ అలా కాదనుకుంటున్నా..
ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడనుకుంటున్నా. టీమిండియా గెలిచినా ఓడినా ఆయన స్పందన ఒకేలా ఉంటుందని ఆశిస్తున్నా. ద్రవిడ్ తొలి ప్రాధాన్యం ఆటగాళ్ల ప్రవర్తన బాగుండాలని చూస్తాడు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక 2018-2019 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి బోర్డర్-గవాస్కర్ సిరీస్ గెలిచిన అనంతరం రవిశాస్త్రి స్పందిస్తూ.. ఇదో అతిపెద్ద విజయమని, అది 1983 ప్రపంచకప్ కన్నా గొప్ప విశేషమని కొనియాడాడు. ఈ వ్యాఖ్యలనే తాజాగా గుర్తూ చేస్తూ... రవిశాస్త్రిపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

లక్‌తోనే జట్టులో..
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఎంతో అదృష్టవంతుడని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లో లేకపోయినా అతను జట్టులో కొనసాగుతున్నాడని తెలిపాడు. వైస్ కెప్టెన్ హోదాలోనే అతను ఇంకా జట్టులో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గంభీర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ''మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా పంపితే బాగుంటుంది. అలా అయితే నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను పంపాల్సి ఉంటుంది. ఇక రహానే విషయానికొస్తే.. నిజంగా తను అదృష్టవంతుడు. అవసరమైనపుడు సారథిగా వ్యవహరిస్తున్నందుకే తనకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను.

విహారికి చాన్స్ ఇవ్వాల్సింది..
అయితే, కనీసం ఈసారైనా తను ఈ ఛాన్స్‌ను చక్కగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నా'' అని పేర్కొన్నాడు. ఇక తెలుగు క్రికెటర్ హనుమ విహారిని ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్న గంభీర్... ఇండియా 'ఏ' జట్టులో మాత్రం స్థానం ఎందుకని ప్రశ్నించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చక్కగా రాణించే విహారి.. రహానే లేదంటే మిడిలార్డర్‌లో ఎవరో ఒకరి స్థానాన్ని భర్తీ చేయగలడని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
