For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటగాళ్లందరి ముందు ఇంగ్లండ్ కోచ్‌కు క్షమాపణలు చెప్పా: గౌతమ్ గంభీర్

ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు ఆటగాళ్లందరి ముందు క్షమాపణలు చెప్పానని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఐపీఎల్‌లో తామిద్దరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపాడు. 2012 ఐపీఎల్ సీజన్ ఫైనల్‌కు ముందు ఈ ఘటన చోటు చేసుకుందన్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిసారి 2012 సీజన్‌లో విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ లక్ష్మీపతి బాలాజీ గాయపడటంతో ఓవర్‌సీస్ పేసర్ బ్రెట్‌లీని బరిలోకి దించాల్సి వచ్చింది. దాంతో స్టార్ బ్యాటర్ అయిన బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై ఆ జట్టు వేటువేయాల్సి వచ్చింది.

Gautam Gambhir recalls when he apologized to Brendon McCullum in front of entire KKR team

ఈ ఘటననే తాజాగా గుర్తు చేసుకున్న గంభీర్.. కెప్టెన్‌గా మెక్‌కల్లమ్‌కు జట్టులోని ఆటగాళ్లందరి ముందు క్షమాపణలు చెప్పానని గుర్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

'ఐపీఎల్ 2012 సీజన్ ఫైనల్ కోసం చెన్నై వెళ్లే ముందు జట్టు సభ్యులందరి సమక్షంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు క్షమాపణలు చెప్పాను. జట్టు నుంచి తప్పిస్తున్నందుకు క్షమించాలని కోరాను. 'నీ ఆటతీరు వల్ల నిన్ను పక్కనపెట్టడం లేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'అని మెక్‌కల్లమ్‌కు వివరించాను. ఇలా ఎవరూ చేయరు. కానీ నేను జట్టులోని ఆటగాళ్లందరి ముందు అతన్ని క్షమాపణలు కోరాను. క్షమాపణలు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు.

జట్టులోని అందరి ముందు క్షమాపణలు చెప్పకపోతే.. ఏదో తప్పు చేశాననే అపరాధ భావం నన్ను వెంటాడుతోంది. కెప్టెన్ అంటే ప్రశంసలు పొందడం, క్రెడిట్ తీసుకోవడమే కాదు. ఆటగాళ్లకు క్షమాపణ చెప్పే ధైర్యం కూడా ఉండాలి. కొన్నిసార్లు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ సారథిగా ఎదగాలంటే ఇవన్నీ చేయాల్సిందే.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నాటి ఫైనల్లో గంభీర్ సారథ్యంలోని కేకేఆర్ విజేతగా నిలిచి తొలి టైటిల్ అందుకుంది. 2014లో అతని సారథ్యంలోనే రెండో టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి మరో టైటిల్ అందుకోలేకపోయింది. బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా.. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 2021‌లో ఫైనల్ చేరిన కేకేఆర్ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. చెన్నై చేతిలో ఓటమిపాలైంది.

2018లో కేకేఆర్‌ను వదిలేసిన గంభీర్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆశించిన రితీలో రాణించకపోవడంతో టోర్నీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా విధులు నిర్వర్తించాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ మెంటార్‌గా కేకేఆర్‌ జట్టులో చేరాడు. కేకేఆర్‌ను వదిలేసిన మెక్‌కల్లమ్.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. బజ్‌బాల్‌తో టెస్ట్ క్రికెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Story first published: Thursday, February 8, 2024, 16:32 [IST]
Other articles published on Feb 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+