భారత్‌లో రికీ పాంటింగ్ చేతకానివాడు: గంభీర్

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు. ఈ కారణంగానే మైదానంలో పలుమార్లు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కవ్వింపులకు దిగాడు. 2007లో కాన్పూర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదితో మాటల యుద్దానికి దిగాడు. 2008లో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్‌ను మోచేయితో తోశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఐపీఎల్ 2013 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కూడా వాగ్వాదానికి దిగాడు. ఒకసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను స్లెడ్జింగ్ కూడా చేసాడు.

డబుల్ సెంచరీ చేశా
రికీ పాంటింగ్‌ను స్లెడ్జింగ్ చేయడాన్ని ఆస్వాదించినట్లు గౌతమ్ గంభీర్ తాజాగా చెప్పాడు. గంభీర్ తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో పాల్గొనగా.. ఆ ఛానెల్ వ్యాఖ్యాత ఓ ప్రశ్న అడిగాడు. 'ఆటలో ఎవరిని స్లెడ్జింగ్ చేసి బాగా ఆస్వాదించావు?' అని ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. పాంటింగ్ పేరు చెప్పాడు. '2008లో ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడింది. అనిల్ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. బెంగుళూరులో తొలి టెస్టు సందర్భంగా నేను డబుల్ సెంచరీ చేశాను' అని గౌతీ చెప్పాడు.

భారత్ గడ్డపై చేసిందేం లేదు
'నేను డబుల్ సెంచరీ చేసిన అనంతరం రికీ పాంటింగ్ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. "నువ్వు ప్రపంచంపైన ఏమాత్రం ప్రభావం చూపలేదు" అని అన్నాడు. దాంతో నాకు చిరాకొచ్చింది. "నువ్వు కూడా భారత్ గడ్డపై చేసిందేం లేదు. నిజం చెప్పాలంటే నువ్విక్కడ విఫలమయ్యావు" అని గట్టిగా బదులిచ్చా. రికీ రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాయి. భారత్‌లో పాంటింగ్ చేతకానివాడు' అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.

26.48 సగటుతో 662 పరుగులు
రికీ పాంటింగ్ ఆసీస్ గొప్ప కెప్టెన్లలో ఒకడు. అతని సారథ్యంలో ఆసీస్ రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకుంది. పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 71 సెంచరీలు బాదాడు. అయితే ఆసీస్ మాజీ సారథి గణంకాలు భారత్‌లో గొప్పగా ఏమీ లేవు. ఇక్కడ 14 టెస్టులు ఆడిన పాంటింగ్.. 26.48 సగటుతో 662 పరుగులు మాత్రమే చేశాడు.

ఫిట్‌గా ఉండటంతోనే
కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా తెలివైన ఆటగాడని మెచ్చుకుంటూనే.. అతనికి వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఉన్న బలం, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌కు ఉన్న సామర్థ్యం లేదని గౌతమ్ గంభీర్ అన్నాడు. కేవలం ఫిట్‌నెస్‌తోనే క్రికెట్‌లో రాణిస్తున్నాడన్నాడు. 'విరాట్ చాలా తెలివైన ఆటగాడు. చాలా ఫిట్‌గా ఉండటంతోనే టీ20 క్రికెట్‌లో సక్సెస్ అవుతున్నాడు. ఎందుకంటే అతనికి క్రిస్ గేల్ కండ బలం లేదు.. డివిలియర్స్, జాక్వస్ కల్లిస్, బియన్ లారాలా సామర్థ్యం లేదు. కానీ అతని అతిపెద్ద బలం ఫిట్‌నెస్. ఆ బలంతోనే ఆడుతూ సక్సెస్ అవుతున్నాడు. ఆ విషయంలో మనమంతా అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా వికెట్ల మధ్య విరాట్ అద్భుతంగా పరుగెత్తుతాడు. చాలా మంది రన్స్ తీయరు. అదే అతని సక్సెస్ సీక్రెట్' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
పింక్ బంతితో ఆడటం బ్యాట్స్‌మన్‌కు పెద్ద సవాల్: పుజారా